Monday, December 23, 2024

జానీ మాస్టర్ తప్పు చేయలేదు… చేస్తే వదిలేస్తా: సుమలత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మైనర్‌గా ఉన్నప్పుడు అమ్మాయిపై  అఘాయిత్యం జరిగిందనడానికి సాక్ష్యం ఉందా? అని జానీ మాస్టర్ భార్య సుమలత ప్రశ్నించారు. జానీ మాస్టర్ ఆమె అమ్మాయితో సాన్నిహిత్యంగా ఉండటం ఎవరైనా చూశారు?, ఆ అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడిందా? అని అడిగారు. ఓ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జానీ మస్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ ఆయేషా మాట్లాడారు. తన భర్త తప్పు చేశాడని నిరూపిస్తే ఆయనను వదిలేస్తానని చెప్పారు. జానీ ఎప్పుడైనా ప్రతిభ ఉన్నవాళ్లను ప్రోత్సహిస్తారని, ఎవరికైనా అవకాశాలు రాకుండా ఆయన ఎందుకు చేస్తారని సుమలత నిలదీశారు. కొరియోగ్రాఫర్‌గా అమ్మాయి అగ్రస్థానంలో ఉండాలనే కోరిక ఆమెకు ఎక్కవగా ఉండేదని, హీరోయిన్‌గా స్థిరపడాలనేది ఆ అమ్మాయితో పాటు తల్లి కోరిక ఉండేదన్నారు. ఆమె ను జానీ మాస్టర్ లైంగికంగా వేధిస్తే.. ఆమె పలుమార్లు జానీ మాస్టర్ వద్ద పని చేయడం తన అదృష్టమని నవ్వుతూ ఎందుకు చెబుతుందని సుమలత ప్రశ్నించారు.. తాను చేసిన సినిమాలో ఆమె కొరియా గ్రాఫర్‌గా అవకాశం ఇవ్వడంతో పాటు హైదరాబాద్‌లో అసోషియేషన్ కార్డు పొందేందుకు ఆమె దగ్గర డబ్బులు లేఎకపోతే మాస్టర్ ముంబయిలో ఇప్పించారని తెలియజేశారు. డ్యాన్స్ షోలను చూసి తన లగ్జరీ లైఫ్ కావాలని కోరుకునేదని, ఆమెకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని అనుకునేదని అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News