Wednesday, January 22, 2025

సీతారామం… ఒక క్లాసిక్ ఎపిక్

- Advertisement -
- Advertisement -

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ’సీతా రామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా, రష్మిక మందన్న కీలక పాత్రలో యుద్ధం నేపధ్యంలో అందమైన ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం నుండి మరో బిగ్ సర్‌ప్రైజ్ బయటికి వచ్చింది. ఈ చిత్రంలో హీరో సుమంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బ్రిగేడియర్ విష్ణు శర్మగా సుమంత్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఫస్ట్ లుక్‌లో ప్రేక్షకులు మునుపెన్నడూ చూడని ఇంటెన్స్ లుక్‌లో ఆయన కనిపించారు. సాఫ్ట్, క్లాస్ పాత్రలలో కనిపించే సుమంత్ బ్రిగేడియర్ విష్ణు శర్మగా టెర్రిఫిక్ లుక్‌లో కనిపించారు. ఆర్మీ దుస్తుల్లో మెలితిరిగిన మీసాలతో సీరియస్‌గా చూస్తున్న సుమంత్ మేకోవర్ సరికొత్తగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో సుమంత్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని ఫస్ట్ లుక్ చూస్తే అర్ధమవుతుంది.

ఈ సందర్భంగా వీడియోని కూడా విడుదల చేశారు మేకర్స్. “కొన్ని యుద్ధాలు మొదలుపెట్టడం మాత్రమే మన చేతుల్లో వుంటుంది. ముగింపు కాదు. బ్రిగేడియర్ విష్ణు శర్మ… మద్రాస్ రెజిమెంట్‌” అని సుమంత్ చెప్పిన డైలాగ్ మరింత ఆసక్తికరంగా వుంది. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో సుమంత్ మాట్లాడుతూ “సీతారామం… ఒక క్లాసిక్ ఎపిక్ చిత్రంగా నిలుస్తుంది. నా కెరీర్‌లో మొదటి సపోర్టింగ్ రోల్. ఈ స్క్రిప్ట్ ని చాలా క్షుణ్ణంగా చదివాను. చాలా చోట్ల కన్నీళ్లు వచ్చాయి. నా పాత్రే కాదు ఈ సినిమాలో అన్నీ పాత్రలు చాలా కీలకంగా వుంటాయి. హీరో పాత్రలు చేస్తూ ఇలాంటి కీలకమైన పాత్రలు చేయాలనీ ఎప్పటినుండో అనుకుంటున్నాను. బ్రిగేడియర్ విష్ణు శర్మ చాలా భిన్నమైన పాత్ర. సవాల్‌తో కూడినది” అని అన్నారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Sumanth First Look Out from Sita Ramam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News