Friday, December 20, 2024

సమ్మర్ ఎఫెక్ట్.. బస్సుల్లో తగ్గుతోన్న ప్రయాణికుల సంఖ్య

- Advertisement -
- Advertisement -

Summer Effects on TSRTC buses

ఎండ వేడిమి నుంచి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలంటున్న ప్రయాణికులు

హైదరాబాద్: నగరంలో పగటి పూట ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగి పోతున్నాయి. దాంతో ఆర్టీసీలో ప్రయాణించాలంటే ప్రయాణికులు జంకుతున్నారు. పగటి పూట పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల ప్రభావంతో ఆర్టీసీలో ప్రయాణించే వారు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బస్సు రేడియేటర్ నుంచి వచ్చే వేడి ఒక వైపు, బస్సులకు అద్దాలు సరిగా లేక పోవడంతో బయట నుంచి వచ్చే వేడిగాలులతో మరొక వైపు, ఇంకో వైపు బస్సులు రంగులు వెలిసిపోవడంతో బస్సుకు ఉన్న రేకులు వేడెక్కడంతో పాటు సీట్లు కూడా ఎండవేడిమికి కాలిపోతున్నాయి.. వీటితో ప్రయణికులు ప్రయాణికులు పడే కష్టాలు అన్నీ, ఇన్నీ కావు.. ఉష్ణోగ్రతలు పెరగడంతో బస్సుల్లో ప్రయాణించేందుకు చెమటోడుస్తున్నారు. అకాల వర్షాలతో నిన్నమెన్నటి దాకా ఇబ్బంది పడ్డ ప్రజలు తాజాగా గత కొద్ది రోజులుగా నగరంలో ఉష్ణోగ్రతలు అమాతం పెరిగిపోయాయి.

దీంతో మధ్యాహ్నం వేళల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య తగ్గుతోంది. పలు రూట్లలో వెళ్ళే ప్రయాణికులు పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా ఆర్టీసీ బస్సులకు దూరంగా ఉంటున్నారు. బస్సుల్లో వస్తోన్న వేడిగాలులకు గంట కూడా ప్రయాణించ లేక పోతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. మరో రెండు నెలలు పాట వేసవి తీవ్రత ఉంటుంది, కాబట్టి ఆర్టీనరీ బస్సుల్లో ఎండ తీవ్రతను తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. బస్సులు గంటల కొలది రోడ్లపై నిలపడంతో బస్సుల్లో ప్రయాణించే వారు అనేక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. రోజు నగరంలో 2750 బస్సులు సుమారు 7 లక్షల కిలో మీటర్లు తిరుగుతున్నాయి. ఉదయం 11 గంటల నుంచే ఉష్ణోగ్రతలు పెరగడంతో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల మధ్యాహ్నం సమయంలో బాగా తగ్గుతోంది. బస్సులపై తెల్లని పెయింట్ వేయడంతో పాటు కిటికీల వద్ద వేడిగాలులు రాకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు… మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల ఫిట్ నెస్ సరిగా లేక పోవడంతో తరచు రోడ్లపై ఆగిపోతున్నాయి. దాంతో ప్రయాణికులు గమ్యస్థానం చేరుకోకుండా మధ్యలో నడి రోడ్దుమీద ఎండలో దిగాల్సి వస్తోంది.

మధ్యాహ్నం సమయంలో బస్సుల సంఖ్య కూడా తక్కువగా ఉండటంతో వారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకుంటున్నారు. గతం శీతాకాలంలో రాత్రిపూట చలికి బస్సుల్లో ప్రయాణించాలంటే భయం పడేవారు. ఇప్పుడు ఎండాకాలం బస్సులో ప్రయాణించాలంటే భయపడుతున్నారు. వర్షాకాలంలో వర్షాలకు ఈ విధంగా ప్రయాణికులు మూడు కాలాల్లోనూ ప్రయాణించాలంటే భయపడుతున్నారు. దాని కారణం ఆర్టీసీ అధికారులకు ప్రయాణికులపై నిర్లక్ష దోరణే కారణమనే విమర్శలు వస్తున్నాయి. ముందు అద్డాలు సరిగా ఉంటే , వెనక అద్దాలు సరిగా ఉండవు. కిటీకీలు ఉన్నా ప్రయోజనం లేదు ఎందుకంటే వాటికి కూడా అద్దాలు ఉండవు కాబట్టి. ఏది ఏమైనప్పటికి ప్రయాణికుల భద్రత పట్ల ఆర్టీసీ నిర్లక్షం వహిస్తుందనే విమర్శలు వస్తున్నాయి.

ఏసీ బస్సుల సంఖ్యను పెంచాలి

నగరంలో ఏసీ బస్సులు 160 ఉండగా వాటిలో సుమారు 40 బస్సులను రాజదాని బస్సులుగా మార్చి వేయడంతో వాటి 120 తగ్గింది. ఇంక మిగిలిన బస్సులను కొన్ని ప్రదానమైన మార్గాల్లోనే నడుపుతున్నారు. బస్సుల సంఖ్యను నగరవ్యాప్తంగా పెంచితే ఆదాయం పెరగడంతో పాటు ప్రయాణికులు సమస్యలు కూడా పరిష్కారం అవుతాయంటున్నారు పలువురు అధికారులు.నగరంలో కాలం చెల్లినబస్సులను తొలగించి వాటి స్థానంలో ఏసీ బస్సులను తీసుకురావాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News