- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు ఆదివారం నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. అకడమిక్ క్యాలెండర్ పేర్కొన్న విధంగా శనివారంతో పనిదినాలు ముగియగా, ఆదివారం(ఏప్రిల్ 24) నుంచి జూన్ 12వ తేదీ వరకు పాఠశాల విద్యాశాఖ వేసవి సెలవులు ప్రకటించింది. తిరిగి జూన్ 13వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ వేసవి సెలవులు ఒకటవ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు మాత్రమే ఉంటాయి. మే 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. టెన్త్ పరీక్షల నేపథ్యంలో టెన్త్ విద్యార్థులు ప్రిపరేషన్ కొనసాగించేలా పాఠశాలల్లో ఏర్పాటు చేశారు. ఇందుకోసం సెలవుల్లో కూడా రోజుకు ఒక టీచర్ పాఠశాలలకు వెళ్లాలని ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ఆదేశాలు జారీ చేశారు.
Summer Holidays from April 24 for Schools
- Advertisement -