మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. మే ఒకటో తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు న్యాయస్థానా నికి సెలవులు ప్రకటిస్తూ రిజిస్ట్రార్ జనరల్ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే శనివారం, ఆదివారం రావడంతో నేటి నుంచే సెలవులు ఉండను న్నాయి. దీంతో శుక్రవారం ఒక్కరోజే కోర్టు నడవనుంది. వరుస సెలవుల నేపథ్యంలో అత్యవసర కేసుల విచారణకు మాత్రం ప్రత్యేక బెంచ్ లు ఏర్పాటు చేశారు.
మే 4,11,18,25 జూన్ 1వ తేదీని ఈ బెంచ్ లు నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ వెల్లడించారు. అంటే హెబియస్ కార్పస్ పిటిషన్లు, ముందస్తు బెయిల్, బెయిల్ పిటిషన్లు, బెయిల్ తిరస్కరణపై అప్పీల్ ఇతర ఎమర్జెన్సీ కేసులను మాత్రమే వెకేషన్ కోర్టులు విచారిస్తాయి. అయితే ప్రతీ గురువారం ఈ కేసుల విచారణ ప్రత్యేక కోర్టు నిర్వహించనుంది. నెల రోజుల సెలవుల్లో 5 సార్లు స్పెషల్ బెంచ్ లు ఏర్పాటు కానున్నాయి.