Sunday, January 19, 2025

భానుడి సెగ..వరుణుడి పగ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో/సూర్యాపేట ప్ర తినిధి : ఉమ్మడి ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో ఆ దివారం సాయంత్రం వర్షం బీభత్సం సృష్టించిం ది. ఈ వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న ప్రజలకు చాలా రోజుల తరువాత కురిసిన వర్షంతో ప్రజలు ఊరట చెందినప్పటికీ భద్రా ద్రి కొత్తగూడెంలో ఉరుములు, మెరుపులతో గాలి దూ మారంతో కూడిన వర్షం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. బలంగా వీచిన గాలులకు రో డ్ల పై వాహనాలు సైతం కొట్టుకుపోయాయి. కొత్తగూడెం జిల్లా కేంద్రంతోపాటు మణుగూర్, ఇల్లెం దు, భద్రాచలం ఏరియాతో పాటు దాదాపు అన్ని ప్రాంతాల్లో భారీ ఈదురు గాలులు, కుండపోత వ ర్షం కురిసింది. కొన్నిచోట్ల వడగండ్ల వాన పడిం ది.. జిల్లా కేంద్రంలో బలమైన గాలుల కారణంగా ఇంటిపై కప్పు రేకులు, సైన్ బోర్డులు, కటౌట్‌లు ఎగిరిపడ్డాయి.. పలు ఇళ్ళు ధ్వంసమయ్యాయి.

సాయంత్రం 5 గంటల నుంచి ఉరుములు, మెరుపులతో కుడిన వర్షంతో రోడ్లు జలమయంగా మా రాయి. చాలా చోట్ల చెట్లు, కరెంట్ స్తంభాలు నేలకొరిగాయి. పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సింగరేణి మండలం, ఖమ్మం, ఇల్లెందు రహదారి, గిద్దెవారి గూడెం స్టేజ్ వద్ద కురిసిన వర్షానికి భారీ వృక్షం రోడ్డుకి అడ్డంగా పడి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కరకగూడెంలో ఇళ్ళపై ఉన్న రేకులు కొట్టుకుపోయాయి. ఖమ్మం జిల్లాలో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. జిల్లా కేంద్రమైన ఖమ్మం నగరంలో ఒకేసారి వాతావరణం చలబడటంతో ప్రజలు ఆహ్లాదం పొందారు. కూసుమంచి మండలంలో తాటి చెట్టుపై పిడుగు పడింది. దీంతో భారీ శబ్ధానికి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమీపంలో ప్రజలెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఏదేమైనా గత నెల రోజులుగా భానుడి ప్రతాపానికి తల్లడిల్లిన ప్రజలు ఆదివారం సాయంత్రం కురిసిన వర్షంతో కాస్త సేద తీరారు. అయితే పలు గ్రామాల్లో కళ్ళాల వద్ద రైతులు ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యం కొనుగోలు

కేంద్రాల్లో ధాన్యం బస్తాలు కూడా తడిసిపోయాయి.
ఇదిలావుండగా, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అకాల వర్షంతో అన్నదాత ఆగమాగం కాగా, గత కొన్ని రోజుల నుండి మండిపోతున్న భానుడి సెగల నుండి కొంత ఉపశమనం లభించింది. ఆదివారం సాయంత్రం ఉరుములతో కూడిన గాలి, దుమ్ము దుమారం రేపడంతో జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ మండలాలలో అకాల వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడిసి ముద్దవగా వాటిని రక్షించుకునే పనిలో అన్నదాతలు నిమగ్నమైనప్పటికీ ధాన్యం తడిసి ముద్దయిందని పలువురు బోరున విలపించారు. అకాల వర్షం కారణంగా రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వర్షం కారణంగా సూర్యాపేటలోని అంజనాపురి కాలనీ వద్ద రోడ్డుపై చెట్టు విరిగి పడడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. బీబీగూడెం సమీపంలోని రైస్ మిల్లు, మధుర వైన్స్ వద్ద చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి రోడ్డుపై పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News