Monday, December 23, 2024

రాష్ట్రం నిప్పుల కుంపటి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ఈ వేసవిలో ఎండలు భగ్గమని మండిపోనున్నాయి. ఏప్రిల్ నుంచి జూన్ వరకూ దేశంలోని చాల ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్ల డించింది. తూర్పు ,ఈశాన్య , వాయువ్య భారతంలోని కొన్ని ప్రాంతాలు మినహా ఎక్కవ శాతం సాధారణం కంటే గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ రా ష్ట్రంలో కూడా జూన్ వరకూ గరిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అ వకాశాలు ఉన్నట్టు ఐఎండి వెల్లడించింది. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉ న్నాయి.ఏప్రిల్ నుంచి తెలంగాణలో వడగాల్పుల తీవ్రత కూ డా పెరిగే అవకాశాలు ఉన్నట్టు హెచ్చరించింది. రాష్ట్రంలోని కొ న్ని ప్రాంతాలలో సాధరణం కంటే ఎక్కువ రోజులు వడ గాల్పులు వీచే అవకాశాలు ఉన్నాయి .

ఈ వేసవిలో సగటున ఆరు నుంచి తొమ్మిది రోజుల పాటు వడగాల్పలు వీచే అవకాశాలు ఉన్నట్టు వెల్లడించింది. ఏప్రిల్ నెలలో కొన్ని ప్రాంతాలలో వీటి తీవ్రత అధికంగా ఉండనుంది, ఈ నెలలో మూడు నుంచి నాలుగు రోజుల పాటు వడగాల్పులు వీచే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. ఏప్రిల్ నెల తెలంగాణ రాష్ట్రంలో వర్షపాతం కూడా సగటు నుండి సగటు కంటే ఎక్కువగా 88శాతం నుండి 112శాతం వరకూ ఉండనుంది. దక్షిణ ద్వీపకల్పంలోని తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో సాధారణం నుండి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వెల్లడించింది.

మరో 5రోజులు నిప్పులు !
తెలంగాణ రాష్ట్రంలో అసాధారణ వాతావరణ పరిస్థితలు ఏర్పడుతున్నాయి. ఉష్ణోగ్రతల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాగల 5రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు డిగ్రీలు పెరిగి సగటున 44డిగ్రీలు నమోదయ్యే అవాకాశాలు ఉన్నట్టు ఐఎండి వెల్లడించింది.సోమవారం రాష్ట్రంలో అత్యధికంగా 43డిగ్రీలకు పెరిగాయి. సిద్దిపేట జిల్లా చిట్యాల్‌లో గరిష్టంగా 43 డిగ్రీలు నమోదయ్యాయ్యి. నల్లగొండ జిల్లా ముడుగుల పల్లిలో కూడా 43డిగ్రీలు నమోదయ్యాయి. సిద్దిపేట జిల్లా డుల్‌మిట్టలో 42.9, నల్లగొండ జిల్లా తిమ్మాపూర్‌లో 42.9, తెల్దేవరపల్లిలో 42.7, పెద్దపల్లి జిల్లా ఎక్లాస్‌పూర్‌లో 42.9, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెళ్లపాడులో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.రాష్ట్రంలో దస్తూరాబాద్, సుజాతానగర్, కల్వాయ్, ఇబ్రహీంపేట్ , నిజాంపేట్ , మర్తన్నపేట్, ఎడపల్లె, మల్కాపూర్ ,వంకులం, నామ్‌పల్లి, ఖసీంపేట్ , లక్ష్మిదేవరపల్లి తదితర ప్రాంతాల్లో కూడ 42.6డిగ్రీలు నమోదైయ్యాయి.

గ్రేటర్‌లో 41డిగ్రీల పైనే:
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కూడా 41డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జియాగూడ, కూకట్‌పల్లి ,కుత్భుల్లాపూర్, చార్మినార్, ముషీరాబాద్, ఉప్పల్, గోల్కొండ, మారెడుపల్లి, శేరిలిగంపల్లి, కాప్రా, సరూర్‌నగర్ తదితర ప్రాంతాల్లో 41నుంచి 41.7డిగ్రీల వరకూ ఉష్ణోగతలు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News