Monday, December 23, 2024

పొద్దు తిరుగుడు పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలి: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పొద్దు తిరుగుడు పంటను పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు లేఖ రాశారు. ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలతో పాటు వివిధ ప్రాంతాలలో 20,829 ఎకరాల్లో పొద్దు తిరుగుడు పంటను రైతులు పండించారని, పొద్దు తిరుగుడు పంటకు మార్కెట్‌లో కనీస మద్దతు ధర లభించడం లేదని వాపోయారు. ఈ ఏడాది ఫిబ్రవరి 22న ప్రభుత్వానికి లేఖ రాశామని, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు స్పందించి మద్దతు ధర రూ.6760 చెల్లించి కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారని, దాని ప్రకారమే మార్కెట్‌లో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని, రైతుల నుంచి వచ్చిన మొత్తం దిగుబడిని కొనుగోలు చేయకుండా కేంద్రం తన వాటాగా సేకరించాలనుకున్న మేరకే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హరీష్ రావు అడిగారు.

మిగితా పంటను ప్రస్తుతం కొనుగోలు చేయడం లేదని, దీంతో 75 శాతం పంటను రైతులు తక్కువ ధరకు విక్రయించి నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో 1,65,800 క్వింటాళ్ల పొద్దు తిరుగుడు పంట దిగుబడికి వస్తుందని, కేంద్రం తన నిధులతో కేవలం 37,300 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసిందని, మొత్తం పంటలో 25 శాతం మాత్రమే కేంద్రం కొనుగోలు చేసిందని, మిగితా 75 శాతం పంటను తెలంగాణ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చిన మేరకే కొనుగోలు చేసి తెలంగాణ ప్రభుత్వం తరపున కొనుగోలుపై మౌనంగా ఉండడం రైతులను వంచించడమేనని చురకలంటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News