Wednesday, January 22, 2025

ఈనెలలో ఎండతీవ్రత అధికం

- Advertisement -
- Advertisement -

Sun Intensity Hike in March

రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతాయ్
పలు చోట్ల సాధారణం కన్నా ఒకటి నుంచి రెండు డిగ్రీలు అధికంగా నమోదు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్ నాగరత్న

హైదరాబాద్: మార్చి నెలలో ఎండలు మండిపోతాయని, రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు. ప్రస్తుతం ఎండలు సాధారణం కన్నా అధికంగా నమోదవుతున్నాయని ఆమె పేర్కొన్నారు. భానుడి భగభగ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని, పలు చోట్ల సాధారణం కన్నా ఒకటి నుంచి రెండు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ పరిసర జిల్లాల్లో సాధారణం కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు ఆమె వెల్లడించారు. ఏప్రిల్, మే మాసాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News