Monday, December 23, 2024

వానకాలంలో మండుతున్న ఎండలు

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో ః వానలు కురువాల్సిన సమయంలో ఎండలు మండి పోతున్నాయి. వర్ష కాలం ప్రవేశించినా నగరంలో ఎండల తీవ్రత అంతకు అంతా పెరిగింది. దీంతో ఉదయం వేళా ఎండ వేడిమి, రాత్రిళ్లు ఉక్కపోతతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఏటా జూన్ మొదటి వారంలో లోపు ఎండల తీవ్రత తగ్గుముఖం పడుతుంది. ఆ తర్వాత రెండవ వారం ప్రవేశం నుంచి చివర లోపు వర్షాలు కురుస్తాయి. దీంతో ఎండలు పోయి వర్షాలు మొదలు కావడంతో వాతావరణ చల్లబడుతుంది.అయితే ఈ ఏడాది నగరవాసులు భిన్న వాతావరణాన్ని చవి చూడాల్సివస్తోంది. మంచి ఎండకాలంలో భారీగా అకాల వర్షాలు కురువగా, వాన కాలంలో ఎండలు దంచికొడుతున్నాయి.

దీంతో జూన్ 3వ వారం ప్రవేశించినా నగరంలో ఎండలు మండి పోతున్నాయి. దీనికి ఈ ఏడాది రుతుపవనాలు రావడం ఆలస్యమే ఇందుకు కారణమని వాతావరణం శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. శనివారం నగరంలో బహుదూర్ పురాలో ఏకంగా పగటి ఉష్ణోగ్రత 42.9 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రత 35.1 డిగ్రీలు నమోదైంది.అదేవిధంగా సికింద్రాబాద్ మొండా మార్కెట్ 41.2, సరూర్ నగర్‌లో 40.6, సైదాబాద్‌లో 40.5, పాటిగడ్డ లో 40.4 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదైయ్యాయి. వీటితో పాటు నగరంలో పలు ప్రాంతాల్లో 36 నుంచి 40 డిగ్రీలకు వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైయ్యాయి. ఈ సమయంలో సాధారణ ఉష్ణోగ్రత 34 నుంచి35 డిగ్రీల నమోదు కావాల్సి ఉండగా ఏకంగా 5 నుంచి 8 డిగ్రీల వరకు అధికంగా నమోదు అవుతుండడంతో ఎండల తీవ్రతతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు,

ఈనెల 12 నుంచి అన్ని విద్యా సంస్థలు పునర్ ప్రారంభం కావడంతో ఎండ వేడిమితో ముఖ్యంగా విద్యార్థులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మరోవైపు పగలు నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు రాత్రివేళా నమోదుఅవుతుండడంతో ఉక్కపోతతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో 26 నుంచి 27 డిగ్రీల మధ్య ఉండాల్సిన కనిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల పైనే నమోదు అవుతుండడతో పగలు ఎండ వేడిమి, రాత్రి ఉక్కపోతతో నగరవాసులు అష్టకష్టాలు పడుతున్నారు. వరుణ దేవుడు ఎప్పుడు కణికరిస్తారని అని ఎదురు చూస్తున్నారు.
ప్రాంతం కనిష్టం గరిష్టం
బహదూర్‌పురా 35.1 42.9
మొండా మార్కెట్ 33.0 41.2
సరూర్‌నగర్ 33.4 40.6
సైదాబాద్ 33.1 40.5
పాటిగడ్డ 33.1 40.4
మారెడ్ పల్లి 32.7 40.0
అత్తాపూర్ 34.0 39.9
కిషన్ బాగ్ 35.0 39.9
కుషాయిగూడ 31.3 39.6
అల్వాల్ 29.9 39.5
నాగోల్ 31.8 39.5
నేరెడ్‌మెట్ 30.6 39.4
జియాగూడ 32.7 39.4
ముషీరాబాద్ 31.8 39.4
ఐఎస్‌సదన్ 34.1 39.3
రామంతాపూర్ 30.6 39.2
ఖైరతాబాద్ 31.4 39.2
ఉప్పల్ 31.3 39.2
వివేకానంద నగర్ 31.1 39.1
రాక్‌టౌన్ కాలనీ 32.1 39.1
రెయిన్ బజార్ 32.2 39.0
అల్కాపూరి 31.2 39.0

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News