రాష్ట్రంలో వచ్చే ఫిబ్రవరి నెల నుంచి ఎండలు మండిపోతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతానికి రాష్ట్రంలో రాగల మూడు, నాలుగు రోజుల పాటు పొగమంచు ప్రభావం అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ సంచాల కులు డాక్టర్ నాగరత్న తెలిపారు. తూర్పు, ఈశాన్య జిల్లాలతో పాటు హైదరాబాద్ పరిసర జిల్లాల్లో పొగమంచు కురుస్తుందని వాతావరణ శాఖ సంచాలకురాలు వెల్లడించారు. తూర్పు, ఆగ్నేయ గాలుల వల్ల పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వివరించారు.
ఇక, ఫిబ్రవరి 15 వరకు వాతావరణంలో భిన్న పరిస్థితులు నెలకొంటాయని నాగరత్న చెప్పారు. ఒక్కొక్కప్పుడు చల్లగాలులు, మరొక్కప్పుడు వేడిగాలులు వీస్తాయని, ఫిబ్రవరి 15 తర్వాత వేడి తీవ్రత పెరుగుతుందంటున్న వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్ నాగరత్న ఓ మీడియా ఛానల్ తో మాట్లాడు తూ వెల్లడించారు. రాష్ట్రంలో వచ్చే మూడు, నాలుగు రోజులు పొగమంచు ఎక్కువగా ఉంటుంది. తెల్లవారుజామున చలిగా ఉంటుంది. తూర్పు, ఆగ్నేయ గాలు ల వల్ల పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.