Wednesday, January 22, 2025

సైనిక కవాతులో సొమ్మసిల్లిన సైనికులు

- Advertisement -
- Advertisement -

లండన్ : బ్రిటన్‌లో ఎండలు మండిపోతున్నాయి. లండన్‌లో ప్రిన్స్ విలియం ఎదుట జరిగిన సైనిక పరేడ్ దశలో గ్రీష్మతాపాన్ని తట్టుకోలేక ముగ్గురు సైనికులు సొమ్మసిల్లి పడిపోయారు. ఓ వైపు ఘనంగా ఈ రాయల్ గార్డ్ కవాతును ప్రిన్స్ విలియమ్ పర్యవేక్షిస్తున్నప్పుడే సెంట్రల్ లండన్‌లో ఈ ఘటన జరిగింది. ఇక్కడ ఆశ్విక దళాల కవాతు , దీనికి ముందు సైన్యంలోని వాయిద్య బృందం సైనికుల ప్రదర్శన జరిగింది. సాధారణంగా అత్యంత భీకరమైన చలిగాలులతో ఉండే లండన్‌లో ఈసారి ఉష్ణోగ్రతలు విపరీత స్థాయికి చేరుకున్నాయి.

30 డిగ్రీల సెల్సియస్ వేడి దశలో కవాతు సాగుతూ ఉండగా విధుల్లో ఉన్నట్లుండి ఈ అపశృతి నెలకొంది. అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లోనూ సైనికులు ఈ కవాతును నిర్వహించారని, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని విలియమ్ ట్వీటు వెలువరించారు. రాజకీయ సంప్రదాయం ప్రకారం ఇక్కడ వచ్చే శనివారం ట్రూపింగ్ కలర్ పరేడ్ జరుగుతుంది. దీనికి వారం రోజుల ముందు రిహార్సల్ చేపట్టడం ఆనవాయితీ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News