భారీ పంప్డ్ స్టోరేజ్, జలవిద్యుత్, సౌరవిద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు
నాగర్‌కర్నూల్, మంచిర్యాల, ములుగు ప్రాంతాల్లో నిర్మాణం ఈ
మూడు ప్రాజెక్టుల ఇంధన సామర్థం 3,400మెగావాట్లు
7వేల మందికి ఉద్యోగాలు సిఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు
సమక్షంలో ఒప్పందం రాష్ట్ర చరిత్రలో ఇదే భారీ పెట్టుబడుల రికార్డు
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ప్ర భుత్వం దావోస్‌లో బుధవారం భారీ ఒప్పందం చేసుకుంది. దావోస్ వేదికపై కొత్త రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేనంత భారీ పెట్టుబడులను ప్రభుత్వం సమీకరించింది. ఈ నేపథ్యంలోనే దేశంలో ఇంధన రంగంలో పేరొందిన సం స్థ సన్ పెట్రో కెమికల్స్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. తెలంగాణ లో భారీ పంప్డ్ స్టోరేజీ పవర్, సోలార్ పవర్ ప్రా జెక్టులకు రూ.45,500 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సన్ పెట్రోకెమికల్స్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుంది. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం ఈ భారీ పెట్టుబడిని సాధించింది. సన్ పెట్రోకెమికల్స్ సంస్థ రాష్ట్రంలో రూ.45,500 కోట్ల పె ట్టుబడుల ఒప్పందంపై సంతకం చేసింది. రా ష్ట్రంలో భారీ పంప్డ్ స్టోరేజ్, జల విద్యుత్, సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఈ సంస్థ ఏర్పాటు చేయనుంది. ఈ ఒప్పందంతో దాదాపు 7,000 మం దికి ఉద్యోగాలు లభించనున్నాయి.
నాగర్ క ర్నూల్, మంచిర్యాల, ములుగు ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులను ఆ సంస్థ నెలకొల్పనుంది. ఈ మూ డు ప్రాజెక్టుల మొత్తం ఇంధన సామర్థ్యం 3, 400 మెగావాట్లు కాగా, వీటికి 5,440 మెగావా ట్ల సామర్థ్యముండే సోలార్ విద్యుత్ ప్లాంట్లను అనుసంధానం చేయనుంది. ఈ ప్రాజెక్టుల ని ర్మాణ దశలోనే దాదాపు 7,000 ఉద్యోగాలు ల భిస్తాయని ప్రభుత్వం పేర్కొంటుంది. సన్ పె ట్రో కెమికల్స్ ఎండి దిలీప్ సాంఘ్వీతో సిఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఈ ఒప్పందంపై కీలక చర్చలు జరిపారు. పరిశ్రమల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సిఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, ఇన్వెస్టిమెంట్స్ ప్రమోషన్ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో ఎంఓయూపై సంతకాలు చేశారు.
సుస్థిరమైన ఇంధన వృద్ధి సాధించే తెలంగాణ లక్ష్య సాధనలో ఈ ఒప్పందం మైలు రాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చిన సన్ పెట్రో కెమికల్స్ ప్రతినిధులను ఆయన అభినందించారు. ఈ ఒక్క ఒప్పందంతో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం గతేడాది దావోస్‌లో సాధించిన రూ.40 వేల కోట్ల పెట్టుబడుల రికార్డును సమం చేసిందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్ ఇంధన అవసరాల దృష్ట్యా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని సిఎం చెప్పారు. హరిత ఇంధన ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సన్ పెట్రో కెమికల్స్ భాగస్వామ్యంతో భవిష్యత్‌లో డిమాండ్‌కు అనుగుణంగా ఇంధన వనరులు సమకూరుతాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ ఒప్పందంతో రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలతో పాటు నాగర్‌కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాలు పారిశ్రామికంగా వృద్ధి చెందుతాయని సిఎం పేర్కొన్నారు.
సంప్రదింపులు, చర్చలు ఫలించాయి: మంత్రి శ్రీధర్‌బాబు
తమ ప్రభుత్వం జరిపిన సంప్రదింపులు, తమ చర్చలు ఫలించాయని, రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇంత భారీ పెట్టుబడుల ఒప్పందం సాధించటం ఆనందంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తాము చేపట్టబోయే ప్రాజెక్టు తెలంగాణలోనే కాకుండా దేశంలోనే అత్యంత ప్రభావవంతంగా ఉంటుందని సన్ పెట్రో కెమికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ సాంఘ్వీ ధీమా వ్యక్తం చేశారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ పెట్టుబడుల గమ్య స్థానంగా మారిందని, రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకోవటం గర్వంగా ఉందన్నారు. ఇప్పటివరకు దావోస్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న భారీ ఒప్పందం ఇదే.
రూ.800 కోట్లతో అధునాతన అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ యూనిట్
రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగా రాష్ట్రంలో అధునాతన అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ (యూఏవి) తయారీ యూనిట్ ఏర్పాటు చేయడానికి జేఎస్‌డబ్ల్యూ యూఏవి డిఫెన్స్ అనుబంధ సంస్థ ప్రకటించింది. సుమారుగా రూ.800 కోట్లతో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఆ సంస్థ తో రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టుతో డ్రోన్ టెక్నాలజీకి తెలంగాణ ప్రధాన కేంద్రంగా మారే అవకాశముంది.