Wednesday, January 22, 2025

అయోధ్యలో రోడ్లపై సూర్య స్తంభాలు

- Advertisement -
- Advertisement -

రామ మందిరం ప్రారంభోత్సవానికి ముందు ఏర్పాటు

అయోధ్య : వచ్చే నెల రామ మందిరం ప్రతిష్ఠాపనకు అయోధ్య సన్నద్ధం అవుతుండగా, అయోధ్య పట్టణంలోని ప్రముఖ రోడ్డుపై సూర్య స్తంభాలను వరుసగా ఏర్పాటు చేస్తున్నారు. ౩౦ అడుగుల ఎత్తు ఉన్న ఆ స్తంభాలలో ప్రతి ఒక్క స్తంభానికి పైన ఏర్పాటు చేస్తున్న ప్రతిమ ఎలా ఉంటుందంటే రాత్రి వేళ వెలిగించినప్పుడు అది సూర్యుని ప్రతిబింబిస్తుంది. ఉత్తర ప్రదేశ్ పబ్లిక్ వర్క్ అయోధ్య డివిజన్ సీనియర్ అధికారి ఒకరి సమాచారం ప్రకారం, ధర్మ్ పథ్ అనే ఆ రోడ్డుపై అటువంటి 40 స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు.

ఆ రోడ్డు నయా ఘాట్ సమీపంలోని లతా మంగేష్కర్ చౌక్‌ను అయోధ్య బైపాస్‌తో అనుసంధానిస్తుంది. ‘కొత్తగా నిర్మించిన రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపనకు ముందు ఆ సూర్య స్తంభాలను ఏర్పాటు చేసే పని సాగుతోంది. వాటిలో 20 స్తంభాలను లతా మంగేష్కర్ చౌక్ సమీపంలో ఏర్పాటు చేస్తారు. రోడ్డుకు ఒక్కొక్క వైపు 10 స్తంభాలు ఉంటాయి’ అని పిడబ్లుడి అసిస్టెంట్ ఇంజనీర్ ఎ పి సింగ్ తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల ౩౦న అయోధ్యకు రావలసి ఉన్నది. ఆ పర్యటనలో మోదీ పునర్వవస్థీకరించిన అయోధ్య రైల్వే స్టేషన్‌కు, కొత్త విమానాశ్రయానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఆయన ఒక ర్యాలీలో ప్రసంగిస్తారని అధికారులు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News