చెన్నై: కరోనా బాధితుల సహాయార్ధం కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యాజమాన్యం భారీ విరాళాన్ని ప్రకటించింది. కోవిడ్ మహమ్మరి కట్టడికి తనవంతు సాయంగా రూ.30 కోట్ల భారీ మొత్తాన్ని విరాళంగా అందించేందుకు సన్‌రైజర్స్ యాజమాన్యం ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని సన్‌రైజర్స్ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మహమ్మరి కోరల్లో చిక్కుకుని ప్రతి రోజు వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. మరోవైపు దేశంలో ఆక్సిజన్లు, మందుల కొరత తీవ్రంగా ఉంది. ఇలాంటి స్థితిలో బాధితులకు తమవంతు సాయం అందించాలని సన్‌రైజర్స్ యాజమాన్యం నిర్ణయించింది. కరోనా నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు ఈ నిధులను వెచ్చించనున్నట్టు సన్‌రైజర్స్ యాజమాన్యం వెల్లడించింది. ఈ మేరకు రూ.30 కోట్ల రూపాయలను సన్ టివి నెట్‌వర్క్ విడుదల చేసింది. ఆక్సిజన్ సిలిండర్లు, మందుల సరఫరాలో ఎన్జీవోలతో కలిసి తాము కూడా కరోనా కట్టడిలో పాలుపంచుకుంటామని సన్‌రైజర్స్ యాజమాన్యం పేర్కొంది.
Sun Risers donates Rs 30 Cr against Covid 19