Sunday, September 8, 2024

లాయర్‌గా కనిపిస్తా

- Advertisement -
- Advertisement -

Sunaina says about Raja Raja Chora

 

శ్రీవిష్ణు, మేఘా ఆకాశ్, సునైన హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రాజ రాజ చోర’. హితేశ్ గోలి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 19న సినిమా విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ సునైన మీడియాతో మాట్లాడుతూ.. “తెలుగులో ‘టెన్త్ క్లాస్’ తర్వాత చేస్తున్న సినిమా ఇది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర అనిపించడంతో ఈ సినిమాకు ఓకే అన్నాను. నా రియల్ లైఫ్ క్యారెక్టర్‌కు భిన్నమైన పాత్ర ఇది. ఇందులో లాయర్ రోల్‌లో కనిపిస్తాను. ఈ సినిమా ఓ కామెడీ థ్రిల్లర్. కుటుంబం అంతా కలిసే చూసే సినిమా ఇది. హీరో శ్రీవిష్ణు చాలా చాలా సిగ్గరి. తక్కువగా మాట్లాడినా ఫ్రెండ్లీగా మాట్లాడతాడు. ఇక నేను నటిగా డిఫరెంట్ పాత్రలు చేయడానికే ప్రాధాన్యమిస్తాను”అని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News