Monday, December 23, 2024

ఇజ్రాయెల్ స్వీయ రక్షణకు పూర్తి మద్దతు

- Advertisement -
- Advertisement -

టెల్ అవీవ్:తనను తాను రక్షించుకోవడంతో పాటుగా హమాస్‌ను వేటాడే విషయంలో ఇజ్రాయెల్‌కు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ప్రకటించారు. ఇజ్రాయెల్‌ హమాస్ మిలిటెంట్ల మధ్య పోరాటం కొనసాగుతున్న వేళ బ్రిటన్ ప్రధాని సునాక్ గురువారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సమావేశమయ్యారు. మధ్య ఆసియాలో రెండు రోజుల పర్యటనలో భాంగా సునాక్ గురువారం ఇజ్రాయెల్ చేరుకున్నారు. నెతన్యాహుతో సునాక్ సమావేశం అనంతరం ఇరువురు నేతలు కలిసి మీడియాతో మాట్లాడారు.‘ హమాస్ మాదిరి కాకుండా .. పైరులకు ఎలాంటి హానీ కలగకుండా మీరు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని నాకు తెలుసు.పాలస్తీనియన్లు కూడా హమాస్ బాధితులే.ఈ క్రమంలోనే మానవతా సాయానికి అనుమతలి ఇచ్చేందుకు ముందుకు రావడం సంతోషకరం’ అని ఇజ్రాయెల్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు.

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఓ స్నేహితుడిగా మీతోనిలబడతానని, ఇజ్రాయెల్ విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు రిషి సునాక్ చెప్పారు. కాగా హమాస్ మిలిటెంట్లను పూర్తిగా మట్టుబెట్టే దాకా తమ పోరాటం కొనసాగుతుందని, ఇది దీర్ఘకాల పోరాటం అని నెతన్యాహు చెప్పారు.అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడాబుధవారం ఇజ్రాయెల్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ చేస్తున్న పోరుకు అగ్రరాజ్యం మద్దతుగా నిలుస్తుందని చెప్పడం కోసమే తాను ఇజ్రాయెల్‌లో అడుగు పెట్టినట్లు బైడెన్ ప్రకటించారు. బైడెన్ పర్యటన ముగించుకుని వెళ్లిన వెంటనే హమాస్ ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం కురిపించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. బైడెన్ పర్యటన ముగిసిన వెంటనే సునాక్ కూడా ఇజ్రాయెల్ రావడం, హమాస్‌తో జరుపుతున్న పోరులో ఆ దేశానికి తన మద్దతు తెలియజేయడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News