Wednesday, January 22, 2025

తుది వరకూ పోరు

- Advertisement -
- Advertisement -

Sunak's team released a video about Sunak's fight

ఎన్నిక తేదీకి ముందు సునాక్

లండన్ : తుది వరకూ పోరాటమే తన నైజం అని రిషి సునాక్ ప్రకటించారు. బ్రిటన్‌లో కన్సర్వేటివ్ పార్టీ నేత పదవికి తద్వారా దేశ ప్రధానిగా ఎన్నికయ్యేందుకు పోటాపోటీగా రేస్ సాగుతోంది. వెనుకబడ్డ లిజ్ ట్రస్ ఇప్పుడు సునాక్‌కు వెనకకు నెట్టి టోరీ ఎంపిలలో అత్యధిక మద్దతుతో ముందుకు దూసుకువెళ్లినట్లు పల్స్ రేట్‌తో స్పష్టం అయింది. సెప్టెంబర్ 5వ తేదీన ఎంపిలు ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని తమ నేతగా ఎన్నుకోవడం ద్వారా బ్రిటన్‌కు తదుపరి ప్రధానిని ఖరారు చేస్తారు. కీలక ఎన్నిక ప్రక్రియకు రెండు వారాల ముందు సునాక్ బృందం సునాక్ పోరును తెలిపే ఓ వీడియోను వెలువరించింది. తాను చివరి తేదీ చివరి ఓటు వరకూ పోరుసల్పుతూనే ఉంటానని , 30 రోజులలో 100 సభలలో 16000 మంది పార్టీ సభ్యులను ప్రచార దశలో కలిసినట్లు తెలియచేసుకున్నారు. అలుపెరగని పోరుకు దిగేవారిని పోగొట్టుకునేది ఏమీ ఉండదు. గెలిస్తే గెలవచ్చు లేదా శ్రమకు గుర్తింపు నిలుస్తుందని వ్యాఖ్యానించారు.

కష్టాలు ఎన్ని ఉన్నా ముందుకు సాగుతారని, పరాజితగా పేరు తెచ్చుకున్నా అనూహ్య ఫలితం దక్కించుకునే రకం తాను అని సునాక్ తెలిపారు. దేశంలో జరిగిన పలు సర్వేలలో ట్రస్ విజేత అవుతారని తేల్చిచెప్పాయి. బుకీలు కూడా దీనిని నిర్థారించారు. పన్నులు తగ్గిస్తామని, ఆర్థిక సంక్షోభం నివారిస్తామని ఆమె వాగ్దానాలకు దిగుతూ వచ్చారు. అయితే దేశంలో అన్నింటి కంటే ప్రమాదకరమైనది ద్రవ్యోల్బణం అని, వాస్తవిక స్థితిలోనే ఆర్థిక సమస్యలకు పరిష్కారం దక్కాల్సి ఉంటుందని సునాక్ చేస్తున్న ప్రచార శైలికి టోరీ ఎంపిలు కొందరు మద్దతు ప్రకటిస్తున్నారు. ట్రస్ ఆలోచనలు వాస్తవికతల నుంచి సెలవుల దిశగా ఉన్నాయని, సునాక్ మాటలు నిజాల నుంచి నిజాల వైపు సాగుతున్నాయని వారు పేర్కొంటున్నారని అబ్జర్వర్ పత్రిక తెలిపింది. దీనితో క్రమేపీ ప్రధాని పోటీ తేదీ నాటికి వాస్తవిక రూపంపై సస్పెన్స్ కొనసాగుతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News