Monday, December 23, 2024

కిడ్నీలపై వడదెబ్బల దుష్ప్రభావం

- Advertisement -
- Advertisement -

భూతాపంతో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలకు మన మూత్ర పిండాలు దుర్బలంగా ఉంటాయి. అంత వేడిని తట్టుకోలేవు. మితిమీరిన వేడితో పుట్టుకొచ్చే వ్యాధుల్లో కరడుకట్టే మూత్రపిండాల వ్యాధి ఒకటని వైద్యులు చెబుతున్నారు. లాటిన్ అమెరికాతోసహా ఆంధ్రప్రదేశ్‌లో కూడా అత్యధిక వేడి, డీహైడ్రేషన్, మూత్రపిండాల వ్యాధులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంటాయి. అకస్మాత్తుగా మూత్ర పిండాలు దెబ్బతినడానికి, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి, మూత్రనాళాల్లో ఇన్‌ఫెక్షన్లు రాడానికి అత్యధిక వేడియే ప్రభావం చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా వేసవిలో వడదెబ్బ ప్రభావం మూత్రపిండాపై ఉంటుంది. వడదెబ్బ చివరకు ప్రాణాలకు ముప్పు తెస్తుంది కూడా. వేడి, తేమ వాతావరణంలో ఆరు బయలు పనిచేసే వారు వడదెబ్బకు బలవుతుంటారు. వడదెబ్బలకు మూత్ర పిండాలు గాయపడతాయి. వృద్ధుల్లో ఊబకాయం ఉన్నవారు, మధుమేహం రోగులు వడదెబ్బ వల్ల కిడ్నీలు సరిగ్గా పనిచేయకుండా పోతాయి. శరీరంలోని ఉష్ణోగ్రతలు ఎండవేడికి 104 డిగ్రీల ఫారన్‌హీట్ కన్నా ఎక్కువగా పెరిగిపోయినప్పుడు వడదెబ్బ తింటారు. కిడ్నీలు దెబ్బతిన్నవారు డయాలిసిస్ చేయించుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎండల పాలు కాకుండా మంచినీళ్లు ఎక్కువగా తాగితే కొంతవరకు రుగ్మతల నుంచి కోలుకోగలుగుతారు. అత్యధిక వేడి వల్ల వచ్చే కిడ్నీ గాయాలు రక్తప్రసరణ తక్కువైనప్పుడు డిహైడ్రేషన్ ఫలితంగా మరింత అధ్వాన్నమౌతాయి.

అత్యంత వేడి ప్రభావంతో కండరాల కణాలు విచ్ఛిన్నం ( rhabdomyolysis) అవుతాయి. మయోగ్లోబిన్ అనే ప్రొటీన్‌ను విడుదల చేస్తాయి. ఈ ప్రొటీన్ మూత్ర పిండాల్లోని నాళాలకు హాని కలిగిస్తాయి. ఈ సమయంలో వడదెబ్బ తగిలితే గుండె విఫలం కావడమే కాకుండా, మూత్ర పిండాలు కూడా దెబ్బతింటాయి. వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే చల్లని వాతావరణం లోకి తీసుకెళ్లాలి. శరీరానికి చల్లదనం కలిగించాలి. తలపై, మెడపై ఐస్ ప్యాక్‌లు ఉంచాలి.ఫ్యాన్ గాలి బాగా తగిలే చూడాలి. ఒంటిపై దుస్తులు తొలగించాలి. తగినంత నీరు పట్టించడం కూడా అవసరం.

భారత్‌తోసహా ప్రపంచ దేశాలన్నిటిలో అత్యధిక వేడి వాతావరణంలో రైతులు పొలాల్లో పనిచేస్తుంటారు. ముఖ్యంగా చెరకు తోటల్లో పనిచేసేవారికి కిడ్నీవ్యాధులు చాలా వస్తుంటాయి. చెరకు రసం వంటి చల్లని పానీయాలు తాగించితే ఉపశమనం కలుగుతుంది. అయితే ఈ విధంగా కిడ్నీ దెబ్బతింటే వాటిని తిరిగి మరమ్మతు చేయడం చాలా కష్టం. ఆయా రోగులు తరచుగా డయాలిసిస్ లేదా రీనల్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవలసి ఉంటుంది. పెయిన్ కిల్లర్ మందులను ఎక్కువగా వాడితే కిడ్నీలు దెబ్బతింటాయి. బ్లడ్‌సుగర్ సాధారణ స్థాయిలు, బ్లడ్ ప్రెజర్ స్థాయిలు సరిగ్గా ఉండేలా చూసుకుంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News