గోవా: ‘సన్‌బర్న్ ఫెస్టివల్ గోవా’ 15వ ఎడిషన్ డిసెంబర్ నెలలో జరగనుంది. అయితే కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నవారికే అనుమతి ఉంటుందని నిర్వాహకులు ఆదివారం ప్రకటించారు. గత ఏడాది కూడా ఈ వేడుకలు జరిపారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా జనం ఎక్కువగా పాల్గొనలేదు. ఈ ఏడాది డిసెంబర్ 28 నుంచి 30 వరకు గోవాలోని వాగటోర్లో ఈ వేడుకలు జరుగునున్నాయి. దీనిని నిర్వహిస్తున్న వ్యవస్థాపక సంస్థ ‘పర్సెప్ట్ లైవ్’ ఈ ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ ఫెస్టివల్‌ను నిర్వహించేప్పుడు అన్ని ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. కోవిడ్-19 మార్గదర్శకాలను పాటిస్తామన్నారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ పూర్తి స్థాయిలో జరుగుతోందని, వ్యాక్సిన్ వేసుకున్న వారిని ఈ వేడుకల్లోకి అనుమతిస్తామని పర్సెప్ట్ లైవ్ సంస్థ సిఒఒ కరణ్ సింగ్ తెలిపారు. ఎంతో ఉత్సాహంతో ఈ లైవ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నామని ఆయన అన్నారు.