Friday, December 20, 2024

హైదరాబాద్ లో సన్‌బర్న్ షో రద్దు…

- Advertisement -
- Advertisement -

కొత్త సంవత్సరం సందర్భంగా తలపెట్టిన సన్ బర్న్ కార్యక్రమాన్ని నిర్వాహకులు రద్దు చేసుకున్నారు. పోలీసులనుంచి అనుమతి తీసుకోకుండానే నిర్వాహకులు మాదాపూర్ లో సన్ బర్న్ కార్యక్రమాన్ని ప్లాన్ చేసి, ఆన్ లైన్లో టికెట్ల విక్రయం ప్రారంభించడం వివాదాస్పదమైంది.

సన్ బర్న్ సంగీత కార్యక్రమంలో మద్యానికి అనుమతి ఉంటుంది. దీంతో గతంలో గొడవలు చోటు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ షోకు అనుమతి ఎవరిచ్చారని కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగారు కూడా. తాము ఇంతవరకూ సన్ బర్న్ కు అనుమతి ఇవ్వలేదని తెలిపిన పోలీసు ఉన్నతాధికారులు వెంటనే రంగంలోకి దిగి, ఆన్ లైన్లో టికెట్లు విక్రయిస్తున్న బుక్ మై షో నిర్వాహకులను, ఈవెంట్ నిర్వాహకుల్ని మందలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News