- Advertisement -
ఢిల్లీ: భారత్‌లో కరోనా విలయతాండవం చూసి నా హృదయం ముక్కలైందని మైక్రో సాఫ్ట్ సిఇఒ సత్య నాదేళ్ల తెలిపారు. భారత్‌కు సాయం చేస్తున్న అమెరికా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సహాయక చర్యలు చేపడుతామని మైక్రోసాఫ్ట్ కూడా హామీ ఇచ్చింది. ఆక్సిజన్ పరికరాలను కొనుగోలు చేసేందుకు సాయం చేస్తామని స్పష్టం చేశారు. కరోనా వైరస్ దాటికి విలవిలలాడిపోతున్న భారత్‌ను చూస్తూ బాధగా ఉందని గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. గివ్ ఇండియా పేరుతో యూనిసెఫ్‌కు 135 కోట్ల రూపాయలు సాయం చేసినట్టు సుందర్ పిచాయ్ పేర్కొన్నారు.
- Advertisement -