Friday, December 20, 2024

సుందరకాండ సినిమా టీజర్

- Advertisement -
- Advertisement -

హీరో నారా రోహిత్ ల్యాండ్‌మార్క్ 20వ మూవీ ‘సుందరకాండ’. డెబ్యుటెంట్ వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. టీజర్‌ని లాంచ్ చేసి మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. నారా రోహిత్ ఇందులో సిద్ధార్థ్ అనే సింగిల్ మ్యాన్ పాత్రలో కనిపించారు. తను మ్యారేజ్ ఏజ్ దాటినప్పటికీ, ఐదు క్యాలిటీస్ కలిగి ఉన్న పార్ట్‌నర్ కోసం సెర్చ్ చేయడం, తన మ్యాచస్ కోసం పేరెంట్స్ కూడా విసిగిపోవడం టీజర్ లో హిలేరియస్ గా అనిపించింది. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో నారా రోహిత్ మాట్లాడుతూ “ఇదొక పెక్యులర్ లవ్ స్టొరీ. కమ్ బ్యాక్ మూవీగా ఈ స్క్రిప్ట్‌నే లాక్ చేశాం. ఈ సినిమా జర్నీ చాలా స్పెషల్. వెంకీ బ్రిలియంట్ కథ రాశారు”అని అన్నారు. డైరెక్టర్ వెంకటేష్ నిమ్మలపూడి మాట్లాడుతూ “టీజర్ లానే ఇంతే క్లీన్, నీట్‌గా సినిమా వుంటుంది. సినిమా చూసి నవ్వుకొని కొన్ని మంచి మెమరీస్ ఇంటికి తీసుకెళతారు”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ వృత్తి వాఘని, శ్రీదేవి, డా. నరేష్ వికే, సంతోష్ చిన్నపొల్ల, రాకేష్ మహంకాళి, గౌతమ్ రెడ్డి, వాసుకి, అభినవ్ గోమఠం పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News