Monday, December 23, 2024

కార్పోరేట్‌ ఏజెన్సీతో సుందరం ఫైనాన్స్‌ లిమిటెడ్‌, కేర్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఒప్పందం

- Advertisement -
- Advertisement -

దేశంలో అత్యంత గౌరవనీయమైన ఆర్థిక సేవల కంపెనీలలో ఒకటైన సుందరం ఫైనాన్స్‌ లిమిటెడ్‌, దేశంలో సుప్రసిద్ధ స్పెషలైజ్డ్‌ ఆరోగ్య భీమా సంస్ధలలో ఒకటైన కేర్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ నేడు కార్పోరేట్‌ ఏజన్సీ ఒప్పందం చేసుకున్నాయి. ఈ కార్యక్రమంలో సుందరం ఫైనాన్స్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ లోచన్‌, కేర్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ –సీఈఓ అనూజ్‌ గులాటీ పాల్గొన్నారు.

ఈ భాగస్వామ్యంతో సుందరం ఫైనాన్స్‌ ఇప్పుడు కేర్‌ హెల్త్‌ యొక్క స్పెషలైజ్డ్‌ మరియు వినూత్నమైన శ్రేణి ఆరోగ్య భీమా పరిష్కారాలను తమ లాయల్‌, వృద్ధి చెందుతున్న వినియోగదారులకు అందించనుంది. ఈ ఉత్పత్తులను రిటైల్‌ మరియు సుందరం ఫైనాన్స్‌ యొక్క వినియోగదారుల గ్రూప్‌ విభాగాలకు అందించనున్నారు. కంపెనీ యొక్క ప్రస్తుత టెక్నాలజీ ఆధారిత మరియు అనుకూలీకరణ ఆఫరింగ్స్‌తో పాటుగా వారు తమ విభిన్నమైన భీమా అవసరాలను సైతం ఒకే చోట పొందగలరు.

ఈ భాగస్వామ్యం గురించి కేర్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ –సీఈఓ శ్రీ అనూజ్‌ గులాటీ మాట్లాడుతూ.. ‘‘భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన ఆర్ధిక సేవల సంస్ధలలో ఒకటైన సుందరం ఫైనాన్స్‌ లిమిటెడ్‌తో భాగస్వామ్యం చేసుకుని వారి వినియోగదారులకు సమగ్రమైన ఆరోగ్య భీమా పరిష్కారాలను నాణ్యమైన సేవలతో అందించనుండటం పట్ల సంతోషంగా ఉన్నాము’’అని అన్నారు

సుందరం ఫైనాన్స్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ రాజీవ్‌ లోచన్‌ మాట్లాడుతూ ‘‘ కేర్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాము. మన దేశంలో అగ్రగామి ఆరోగ్య భీమా కంపెనీలో ఒకటి ఇది. దీని ద్వారా మా వినియోగదారులకు వినూత్నశ్రేణి ఆరోగ్య భీమా ఉత్పత్తులను అందించనున్నాము. భీమా పరిశ్రమలో గణనీయమైన మార్పులను కొవిడ్‌ మహమ్మారి తీసుకువచ్చింది. భారతీయ గృహాలలో ఆరోగ్య భీమా ఇప్పుడు తప్పనిసరి అయింది. మా వినియోగదారుల ఆరోగ్య, సంక్షేమంలో అత్యంత కీలకమైన పాత్రను పోషించడానికి అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’’ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News