Monday, December 23, 2024

కామెడీతో పాటు అద్భుతమైన డ్రామా

- Advertisement -
- Advertisement -

ఆర్ టీ టీం వర్క్, గోల్ డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మిస్తున్న చిత్రం ’సుందరం మాస్టర్’. ఈ చిత్రంలో హర్ష చెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 23న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ అయిం ది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వీడియో సందేశం ద్వారా చిరంజీవి మాట్లాడుతూ “సుందరం మాస్టర్’ ట్రైలర్ చాలా బాగుంది. హర్ష కోసమే ఈ పాత్ర పుట్టినట్టుగా ఉంది.

ఆసాంతం వినోదాత్మకంగా ఈ చిత్రం ఉంటుందని అర్థమవుతోంది. ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలి”అని అన్నారు. హర్ష చెముడు మాట్లాడుతూ “సుందరం మాస్టర్ పాత్రను చూస్తే మనలో ఒకరిని చూసినట్టుగానే అనిపిస్తుంది. ఈ చిత్రాన్ని థియేటర్లో చూస్తేనే మజా వస్తుంది. అందరినీ ఆలోచింపజేసే చిత్రమిది. కామెడీనే కాకుండా అద్భుతమైన డ్రామా కూడా ఉంటుంది”అని తెలిపారు. డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్ మాట్లాడుతూ నా చుట్టూ పక్కల చూసిన మనుషుల్ని చూసే ఈ కథను రాసుకున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ దివ్య శ్రీపాద, నిర్మాత సుధీర్ కుమా ర్, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల, దీపక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News