Wednesday, January 22, 2025

హర్ష ఓ కామిక్ యాక్టర్

- Advertisement -
- Advertisement -

ఆర్ టీ టీం వర్క్, గోల్ డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మిస్తున్న చిత్రం ’సుందరం మాస్టర్’. ఈ చిత్రంలో హర్ష చెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 23న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ “సుందరం మాస్టర్ ట్రైలర్ చూశాను. ఎంతో బాగుంది. హర్షని ఓ కమెడియన్ అని చెప్పడం నాకు నచ్చదు.

అతను ఓ కామిక్ యాక్టర్. ఓ సపరేట్ కామెడీ టైమింగ్ ఉంటుంది. డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్‌కు ఈ తొలి ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇవ్వాలి” అని అన్నారు. హీరో హర్ష చెముడు మాట్లాడుతూ “స్వయంకృషితో ఎదిగిన పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి, రవితేజ, సిద్దు జొన్నలగడ్డ మా సినిమాకు సపోర్ట్‌గా నిలిచారు. ఈనెల 23న మా చిత్రాన్ని థియేటర్లలో చూసి ప్రోత్సహించండి”అని తెలిపారు. డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్ మాట్లాడుతూ “కలర్ ఫోటో సినిమా చూశాక హర్ష గురించి నాకు ఓ మీమ్ కనిపించింది. బంగారపు హుండీని చిల్లర కోసం వాడుతున్నార్రా అనే మీమ్ కనిపించింది.

మేం మాత్రం బంగారమే వేశాం. దివ్య పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. ఆమె అద్భుతంగా నటించారు.ఈ సినిమా చూసిన వారందరికీ ఓ సంతృప్తిని మాత్రం ఇస్తుంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌కేఎన్, సాయి రాజేష్, సందీప్ రాజ్, శ్రీచరణ్ పాకాల, రవికాంత్ పేరేపు, రోషన్ కనకాల, కార్తీక్, శరణ్ కొప్పిశెట్టి, ప్రశాంత్ కుమార్ నిమ్మల, షణ్ముఖ్ జశ్వంత్, విజయ్ బిన్నీ, సుధీర్ కుమార్, ఆదిత్య, హరి గౌర తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News