Monday, December 23, 2024

సుందరయ్య పార్కు బోనాలలో చిందేసిన ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్: రాంనగర్ డివిజన్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్కులో తెల్ల ఉప్పలమ్మ దేవాలయం వద్ద బోనాల వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. సుందరయ్య పార్కు వాకర్స్ క్లబ్ అసోసియేషన్‌కు చెందిన, స్థానిక మహిళలు అత్యంత భక్తి శ్రద్దలతో అమ్మవారికి సాంప్రదాయబద్దం గా బోనాలు సమర్పించారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, బిఆర్‌ఎస్ రాష్ట్ర యువజన నాయకులు ముఠా జైసింహలు ముఖ్య అతిథులుగా హజర య్యారు.

ఈ సందర్భంగా సుందరయ్య పార్కు వాకర్స్ అసోసియేషన్ నాయకులు ఉత్సహాభరితంగా డ్యాన్స్‌లు చేశారు. వీరితో పాటు ఎమ్మెల్యే ముఠా గోపాల్ మీతో పాటు నేను కూడా డ్యాన్స్ వేస్తానంటూ అమ్మవారి పాటలకు చిందేశారు. తెల్లఉప్పలమ్మ అమ్మవారికి ఎమ్మెల్యే ముఠా గోపాల్, బిఆర్‌ఎస్ రాష్ట్రన యువజన నాయకులు ముఠా జైసింహతో పాటు ఆలయ కమిటీ అధ్యక్షులు వెంకటకృష్ణారావు, ప్రధాన కార్యదర్శి మన్నె దామోదర్ రెడ్డి, ఉపాధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గౌడ్, కోశాధికారి ఎమ్మెన్ రావు, సుందరయ్య పార్కు వాకర్స్ క్లబ్ అసోసి యేషన్ అధ్యక్షులు ఎస్. రమేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నిరంజన్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఆర్. సంతోష్ గౌడ్, కోశాధికారి సునిల్, బిఆర్‌ఎస్ రాంనగర్ డివిజన్ అధ్యక్షులు రావులపాటి మోజస్‌లు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ సీనియర్ ఉపాధ్యక్షులు కందుకూరి నర్సింహా, రఫి, సంపత్, గుంటూరు రవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను నిర్వాకులు ఘనంగా సత్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News