- Advertisement -
హైదరాబాద్: సండే ఫన్డే కార్యక్రమానికి ట్యాంక్‌బండ్ మరోసారి వేదిక కానుంది. చాలా రోజుల గ్యాప్ తర్వాత ఈ ఆదివారం (02వ తేదీన) సండ్ ఫన్డేను నిర్వహించనున్నట్లు అర్భన్ డెవలప్‌మెంట్ చీఫ్ స్పెషల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ ట్వీట్ చేశారు. అక్టోబర్ 2వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఇది కొనసాగుతుందని ఆయన తెలిపారు. బతుకమ్మ ఉత్సవాలతో పాటు దసరా వేడుకలను తలపించేలా కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు. తినుబండారాలు, హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్ స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. సండే ఫన్డే నేపథ్యంలో ట్యాంక్ బండ్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. విజిటర్లకు ప్రత్యేక పార్కింగ్ సదుపాయం కల్పించనున్నారు.
- Advertisement -