Wednesday, January 22, 2025

ఆదివారం రాశిఫలాలు (22/10/2023)

- Advertisement -
- Advertisement -

మేషం :- శ్రమాధికం. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురై చికాకులు పెట్టిన మిత్రుల సాయంతోపూర్తి చేస్తారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. వాహనాల ప్రయాణాల పట్ల కొంత అప్రమత్తత  అవసరం.

వృషభం:- పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. విందు, వినోదాలు. కుటుంబ సభ్యులతోకలిసి ఆనందంగా గడుపుతారు. చర్చా గోష్టులలో చురుకుగా పాల్గొంటారు. నూతన వన్తు, వస్తా కొనుగోలు చేస్తారు.

మిథునం :- కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ప్రయాణాలులాభిస్తాయి. నూతన యత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయ, కళారంగాల వారు సన్మానాలు పొందుతారు. అర్దికాభివృద్ది అంతంత మాత్రంగా ఉంటుంది.

కర్కాటకం :- వృత్తి-వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. ప్రయాణాలలో తొందరపాటు వద్దు.మిత్రుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. సోదరుల నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. జీవితభాగస్వామి ఆరోగ్యం కొంత ఇబ్బంది పెడుతుంది.

సింహం :- కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రులపరిచయాలు పెరుగుతాయి. అనుకోని అతిథుల నుండి అహ్వానాలు అందుకొంటారు. నూతన వస్తు కొనుగోలు చేస్తారు.

కన్య:- విలువైన వస్తు, ఆభరణాలు, వాహనాల కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. దూరపుబంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. సోదరుల నుండి ఆస్తిలాభం పొందుతారు. కాంట్రాక్టులు కొరకు పైరవీలు చేస్తారు.

తుల:- ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఋణ ఒత్తిడులు తొలుగుతాయి. మానసిక ప్రశాంతతపొందుతారు. వ్యత్తి-వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. సహోదర వర్గంతో విబేధాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి.

వృశ్చికం :-వృత్తి, వ్యాపారాలలో అదనపు బాధ్యతలుపెరిగడం వలన అలసటకి గురవుతారు. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు.

ధనుస్సు:- భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందామని ఆనందాన్ని కుటుంబ సభ్యులతో పాలుపంచుకుంటారు. ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్లు అందుకుంటారు. శ్రమకుతగిన ఫలితం దక్కలేదని విచారిస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది.

మకరం :- బంధువుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపందాలుస్తాయి. ప్రముఖుల కలయిక వలన భవిష్యత్తు కార్యాచరణ చేస్తారు. వాహన యోగం గోచరిస్తున్నది.  క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

కుంభం:- ప్రయాణాలలో తొందరపాటు తనం వద్దు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు ధనంఅందుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. జీవిత భాగస్వామి నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు.కుటుంబంతో ఆనందంగా గడుపుతారు.

మీనం :- కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ధన,వస్తు లాభాలు పొందుతారు. ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు. దైవ చింతన ఏర్పడతాయి. పూజాది శుభకార్యాల కోసం కొంత ధనం వేచ్చిస్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News