Saturday, February 8, 2025

శివరాత్రి కానుకగా ‘మజాకా’

- Advertisement -
- Advertisement -

పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమా ‘మజాకా’కి ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్‌టైనర్‌లో రీతు వర్మ హీరోయిన్. మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. మేకర్స్ మజాకా రిలీజ్ డేట్‌ని ప్రకటించారు.

హైలీ ఎంటర్‌టైనింగ్ మూవీ మజాకా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో సందీప్ కిషన్, రీతు వర్మ స్టయిలిష్ అండ్ కలర్‌ఫుల్ డ్యాన్స్ మూమెంట్ అందరినీ ఆకట్టుకుంది. మాస్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో త్రినాధ రావు నక్కిన మరోసారి తన మార్క్ చూపించబోతున్నారు. త్రినాధ రావు నక్కినతో విజయవంతమైన ప్రాజెక్టులలో కలిసి పనిచేసిన రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ, మజాకాకు కథ, స్క్రీన్‌ప్లే. డైలాగ్స్ రాస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News