Friday, December 27, 2024

సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ‘ఊరు పేరు భైరవకోన సినిమా’ చేస్తున్న టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ ఆ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం 26 చేయడానికి సైన్ చేశారు. మాయవన్ బ్లాక్‌బస్టర్ తర్వాత హీరో సందీప్ కిషన్, దర్శకుడు సివి కుమార్ ఈ చిత్రం కోసం మరోసారి కలిసి పని చేస్తున్నారు. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో రాంబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాయవన్ వరల్డ్ నేపథ్యంలో సాగే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం మాయవన్‌కి సీక్వెల్ కానుంది.

ఈ చిత్రం సూపర్‌ విలన్‌తో ఒక సామాన్యుడి ఘర్షణ కథగా వుండబోతుంది. సోమవారం లాంఛనంగా పూజా కార్యక్రమాలతో సినిమా గ్రాండ్‌గా లాంచ్ అయింది. ముహూర్తం షాట్‌కు దామోదర్ ప్రసాద్ క్లాప్ ఇవ్వగా, వెంకట్ బోయనపల్లి కెమెరా స్విచాన్ చేశారు. తొలి షాట్‌కి జెమినీ కిరణ్ దర్శకత్వం వహించారు. నవంబర్‌లో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News