న్యూఢిల్లీ: పర్యావరణ వేత్త సుందర్ లాల్ బహుగుణ శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 94 సంవత్సరాలు. ఇటీవల కరోనా బారినపడిన సుందర్ లాల్ రిషికేశ్ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అటవీ ప్రాంతాల్లో చెట్లను కొట్టివేయకుండా కాపాడే ప్రయంత్నంలో 1974లో వాటిని కౌగిలించుకోవడం ద్వారా చిప్కో ఉద్యమానికి ప్రారంభించారు. తెహ్రీ ఆనకట్టపై నిరసనలు చేపట్టారు. 2009లో పద్మవిభూషన్ అవార్డును అందుకున్నారు. చెట్లతో పాటు అంతరించిపోతున్న జంతు, పక్షి జాతుల కోసం తన జీవితాంతం పరితపించారు. సుందర్ లాల్ బహుగుణ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం ప్రకటించారు. ప్రకృతికి అనుగుణంగా జీవించే విధానం నేర్పారని ప్రధాని కొనియాడారు. సుందర్ లాల్ సేవలను మర్చిపోలేమని ప్రధాని పేర్కొన్నారు. అటు, సుందర్ లాల్ బహుగుణ మృతి పట్ల టిఆర్ఎస్ ఎంపి సంతోష్ సంతాపం ప్రటించించారు. ప్రకృతి ప్రేమికులకు సుందర్ లాల్ స్ఫూర్తిదాయకమని ఎంపి సంతోష్ పేర్కొన్నారు.
సుందర్ లాల్ బహుగుణ కన్నుమూత
- Advertisement -
- Advertisement -
- Advertisement -