గ్రాండ్ మూవీస్ పతాకంపై ఆర్.రాచయ్య నిర్మించిన విభిన్న కథాచిత్రం ‘గీత‘. దర్శక సంచలనం వి.వి.వినాయక్ ప్రియ శిష్యుడు విశ్వ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. క్రేజీ కథానాయిక హెబ్బా పటేల్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సునీల్ ముఖ్యపాత్ర పోషించగా.. సాయి కిరణ్ విలన్ గా నటించారు. సుభాష్ ఆనంద్ సంగీత సారథ్యం వహించిన ‘గీత‘ చిత్రంలోని గీతాలకు సాగర్ సాహిత్యం సమకూర్చారు.
ఈ ఆడియో వేడుకలో మాజీ మంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, మాజీ మంత్రి పి.శివారెడ్డి తనయుడు పి.గిరిధర్ రెడ్డి, నిర్మాతలు మల్లిడి సత్యనారాయణరెడ్డి, తుమ్మలపల్లి రామత్యనారాయణ, సెవెన్ హిల్స్ సతీష్ కుమార్, యువ దర్శకుడు డైమండ్ రత్నబాబు, సునీల్, హెబ్బా పటేల్, ఈ చిత్రంలో నటించిన ప్రియ, సంధ్యా జనక్, సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్, క్రాంతికుమార్ తదితరులు పాల్గొని ‘గీత‘ ఘన విజయం సాధించాలని ఆకాంక్షించా రు.
దర్శకుడు విశ్వ మాట్లాడుతూ… “ఈ సినిమా అవకాశం నా గురువు, దైవం అయిన వినాయక్ ఇప్పించారు. నిర్మాత రాచయ్యకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను”అని అన్నారు. నిర్మాత ఆర్.రాచయ్య మాట్లాడుతూ… ‘గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకునేలా మా డైరెక్టర్ విశ్వ… ‘గీత‘ చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించా డు. సెప్టెంబర్ 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం”అని తెలిపారు.