Thursday, January 23, 2025

సునీల్ మిట్టల్‌కు బ్రిటన్ నైట్‌హుడ్ పురస్కారం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారతీ ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపకుడు, చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్‌ను బ్రిటన్ నైట్‌హుడ్‌తో సత్కరించింది. ఇది బ్రిటన్‌లో అతి పెద్ద పురస్కారాలలో ఒకటి, ఈ గౌరవం విదేశీ పౌరులకు ఇస్తారు. ఈ గౌరవాన్ని అందుకున్న మొట్టమొదటి భారతీయుడు మిట్టల్ కావడం విశేషం. భారతదేశం, బ్రిటన్ మధ్య వాణిజ్య సంబంధాలను మెరుగుపరచడంలో సహాయం చేసినందుకు కింగ్ చార్లెస్ 3 మిట్టలకు ఈ అవార్డును అందజేశారు. భారతి ఎయిర్‌టెల్ లింక్డ్‌ఇన్‌లో ఒక పోస్ట్ ద్వారా ఈ సమాచారాన్ని అందించింది. సునీల్ మిట్టల్ మాట్లాడుతూ, కింగ్స్ చార్లెస్ నుంచి ఈ గౌరవం అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

బ్రిటన్, భారతదేశం చారిత్రక సంబంధాలను కలిగి ఉన్నాయి, అవి ఇప్పుడు పరస్పర సహకారంతో కొత్త శకంలోకి ప్రవేశిస్తున్నాయి. రెండు గొప్ప దేశాల మధ్య ఆర్థిక, ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి నేను కట్టుబడి ఉన్నారు అని అన్నారు. దేశాన్ని పెట్టుబడులకు ఆకర్షణీయమైన ప్రదేశంగా మార్చడంలో వ్యాపారాల అవసరాలకు మద్దతు అందించిన బ్రిటిష్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. మిట్టల్ భారతదేశం-బ్రిటన్ సిఇఒ ఫోరమ్‌లో ఒక సభ్యుడు, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో సలహాదారుల వైస్ ఛాన్సలర్ సర్కిల్‌గా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News