Thursday, December 19, 2024

ఆ విషయం ఛెత్రి నాకు ముందే చెప్పాడు: కోహ్లి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: భారత స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు సునీల్ ఛెత్రి త్వరలో ఆటకు రిటైర్మెంట్ ప్రకటించనున్న విషయం తెలిసిందే. వచ్చే నెలలో కువైట్‌తో జరిగే ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్ తర్వాత ఛెత్రి ఆటకు వీడ్కోలు పలకాలని నిర్ణయించాడు. కాగా, ఛెత్రి రిటైర్మెంట్ నిర్ణయంపై భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి స్పందించాడు. కోహ్లిఛెత్రిలు మంచి స్నేహితులు అనే విషయం అందరికీ తెలిసిందే. తన ప్రాణ స్నేహితుడు ఛెత్రి రిటైర్మెంట్ విషయం తనకు ముందే తెలిపాడని కోహ్లి పేర్కొన్నాడు. ఈ నిర్ణయాన్ని ప్రకటించే ముందు తనతో చర్చించాడన్నాడు.

తాను కూడా అతని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపానన్నాడు. ఛెత్రిలో అపార నైపుణ్యం దాగివుందన్నాడు. అతనిలాంటి ఆటగాడు చాలా అరుదుగా లభిస్తారన్నాడు. భారత ఫుట్‌బాల్‌పై ఛెత్రి చెరగని ముద్ర వేశాడన్నాడు. అతనికి సాటిరాగల ఆటగాడు ఎవరూ లేరన్నాడు. సుదీర్ఘ కాలంగా ఫుట్‌బాల్‌లో కొనసాగిన ఛెత్రి పూర్తిగా అలసి పోయాడన్నాడు. ఆట నుంచి తప్పుకోవాలనే అతని నిర్ణయాన్ని అందరూ గౌరవించాలన్నాడు. ఛెత్రి ఆటకు వీడ్కోలు పలికినా యువ ఆటగాళ్లకు తన విలువైన సలహాలు, సూచనలు అందిస్తాడనే నమ్మకం తనకు ఉందని కోహ్లి పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News