Sunday, September 8, 2024

‘పుష్ప’లో మంగ‌ళం శ్రీనుగా సునీల్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప’. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ మూవీ మొదటి భాగం ‘పుష్ప ది రైజ్’ డిసెంబర్ 17న పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలై టీజర్, సాంగ్స్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్న సునీల్ ఫస్ట్ లుక్ ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. మంగ‌ళం శ్రీనుగా నటిస్తున్న సునీల్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Sunil First Look Released from ‘Pushpa’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News