ముంబై: ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా ఇటీవల సాధించిన టెస్టు సిరీస్ విజయం చారిత్రాత్మకమని మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కొనియాడు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఆలౌటై అత్యంత చెత్త ప్రదర్శన చేసిన టీమిండియా చివరికి సిరీస్‌ను సొంతం చేసుకోవడం మాములు విషయం కాదన్నాడు. రెండో టెస్టులో టీమిండియా పుంజుకున్న తీరు అద్భుతం. ఆ మ్యాచ్‌లో భారత గెలుపు ఆటగాళ్ల దృఢ సంకల్పానికి నిదర్శనంగా గవాస్కర్ అభివర్ణించాడు. సిరీస్ మొత్తంలో ఆధిపత్యం చెలాయించి కంగారూలను వారి సొంత గడ్డపైనే ఓడించడం భారత్ క్రికెట్‌లోనే అత్యంత అరుదైన విజయమని అభిప్రాయపడ్డాడు.
కోహ్లితో సహా కీలక ఆటగాళ్లందరూ గాయాలతో సిరీస్‌కు దూరమైనా రహానె సారథ్యంలో టీమిండియా కనబరిచిన పోరాట పటిమను ఎంత పొగిడినా తక్కువేనన్నాడు. భారత్ సాధించిన అలాంటి చారిత్రక విజయాన్ని చూసినందుకు చాలా గర్వపడుతున్నానని పేర్కొన్నాడు. ఇదిలావుండగా ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రక విజయం సాధించి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా డౌన్ అండర్ గోస్ ఇండియాస్ గ్రేట్ కమ్‌బ్యాక్ అనే ప్రత్యేక డాక్యుమెంటరీ సిరీస్‌ను సోనీ స్పోర్ట్ నెటవర్క్ ప్రసారం చేయనుంది. ఇందులో గవాస్కర్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు.
Sunil Gavaskar calls India win test series in Aus