Monday, February 24, 2025

అలా తప్పించుకున్నావ్.. కోహ్లీపై మండిపడ్డ గవాస్కర్

- Advertisement -
- Advertisement -

దుబాయ్: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగి మ్యాచ్‌లో భారత ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీం ఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించి సెంచరీ నమోదు చేసి జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు. అయితే ఈ క్రమంలో కోహ్లీపై సర్వత్ర ప్రశంసల వర్షం కురుస్తుండగా.. భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ మ్యాచ్‌లో కోహ్లీ తన స్టైల్‌లో దూకుడుగా కాకుండా.. చాలా నిదానంగా బ్యాటింగ్ చేశాడు. పాకిస్థాన్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పరుగులు రాబట్టాడు. అయితే ఈ క్రమంలో కోహ్లీ చేసిన ఓ తప్పును గవాస్కర్ బయటపెట్టారు. భారత్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో హారిస్ రౌఫ్ వేసిన 21వ ఓవర్ ఐదో బంతికి కోహ్లీ సింగిల్ తీశాడు. సురక్షితంగా క్రీజ్‌లోకి చేరుకున్న తర్వాత ఓవర్ త్రో కాబోతున్న బంతిని తన చేతితో ఆపేశాడు.

దీంతో ఎంసిసి రూల్స్ ప్రకారం ఇది ఫీల్డింగ్‌ని అడ్డుకున్నట్లు అవుతుంది. అయితే అదృష్టవశాత్తు దీనికి పాక్ ఫీల్డర్లు ఎవరూ అపీల్ చేయలేదు. దీంతో కోహ్లీ ఔట్ కాకుండా తప్పించుకున్నాడు. ఇదే విషయాన్ని గవాస్కర్ ప్రస్తావిస్తూ.. ‘కోహ్లీ బంతిని ఆపినప్పుడు పాకిస్థాన్ ఫీల్డర్లు అపీల్ చేసి ఉండే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ, వాళ్లు అలా చేయలేదు. ఎందుకంటే ఆ దగ్గర్లో వాళ్ల ఫీల్డర్ లేడు, అదనపు పరుగు రాలేదు. మిడ్‌వికెట్ ఫీల్డర్ డైవ్ చేస్తే బాగుండేది. కానీ, కోహ్లీ చేసింది మాత్రం సరికదు’ అని గవాస్కర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News