Friday, December 20, 2024

మరో ధోనీ దొరికాడు.. జురెల్‌పై గావస్కర్ ప్రశంసలు

- Advertisement -
- Advertisement -

జురెల్‌పై గావస్కర్ ప్రశంసలు

నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన ఆటతీరుతో భారత్‌ను ఆదుకున్న యువ బ్యాటర్ ధ్రువ్ జురెల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. టెయిలెండర్ల సాయం తో ఇంగడ్‌పై ఒంటరి పోరాటం చేశాడు. 149 బంతులు ఎదుర్కొన్న ధ్రువ్ 6 ఫో ర్లు, 4 సిక్సర్లతో 90 పరుగులు చేశాడు. టీమ్‌ఇండియా మెరుగైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

తొలి సెంచరీకి 10 పరుగుల దూరంలో ఔట్ అయినప్పటికీ.. శతక సమాన ఇన్నింగ్స్ అని పలువురు ప్రశంసిస్తున్నారు. భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఓ అడు గు ముందుకు వేసి అతడిని ధోనీతో పో ల్చాడు. ఇలాంటి ఆరు తీరును మున్ముం దు కూడా కొనసాగిస్తే అతడికి తిరుగులేదని జోస్యం చెప్పాడు. ‘అతడి మానసిక పరిణతి నాకు ధోనిని గుర్తు చేస్తోంది. ఈ రోజు అతడి సెంచరీ చేజారొచ్చు కానీ.. ఇదే ఏకాగ్రత్తతో ఆడితే అతడు ఎన్నో శతకాలు చేస్తాడు’ అని గవాస్కర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News