Sunday, January 19, 2025

జైస్వాల్ జైత్రయాత్ర…. ఆ బ్యాటర్లు రంజీల్లో ఆడాల్సిందే: గావస్కర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టీమిండియా యువ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్‌పై భారత మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియా బ్యాట్స్‌మెన్లు ఇంగ్లాండ్ బౌలర్లకు వికెట్లను బహుమతిగా ఇస్తే… అక్కడే వారిపై జైస్వాల్ జైత్రయాత్ర కొనిసాగించాడని మెచ్చుకున్నారు. జైస్వాల్, శుభ్‌మన్ గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారన్నారు. తొలి టెస్టులో జైస్వాల్ సెంచరీ చేజారిపోవడంతో రెండో టెస్టులో శతకంపై దృష్టి పెట్టాడు.. కానీ డబుల్ సెంచరీతో డబుల్ దమాకా మోగించాడని కొనియాడారు. అతడిని చూస్తుంటే వేగంగా నేర్చుకునే బ్యాట్స్‌మెన్‌గా కనిపిస్తున్నాడని, ఇలాంటి భారీ ఇన్నింగ్స్‌లు ఉంటేనే భారత్ టెస్టుల్లో గెలుస్తుందని గావస్కర్ చెప్పారు.

ఫస్ట్, సెకండ్ టెస్టుల్లో భారత్ బ్యాట్స్‌మెన్లలో కొందరు వికెట్లను ఇంగ్లాండ్ బౌలర్లకు బహుమతిగా ఇచ్చారని విమర్శలు గుప్పించారు. రెండో టెస్టులో గెలిచి ఇంగ్లాండ్-భారత్ మధ్య జరిగిన టెస్టు సిరీస్‌లో సమం చేశారని, కొందరు బ్యాట్స్‌మెన్ల ఫామ్ ఆందోళనకరంగా ఉందని, మిగిలిన టెస్టులో ఇదే విధంగా ప్రదర్శన  చేస్తే స్థానం గల్లంతవుతుందని గావస్కర్ తెలియజేశారు. ఫామ్ కోల్పోయిన వారు రంజీల్లో ఆడి పరుగులు సాధించాలని సూచించారు. అప్పుడే వారిపై నమ్మకం వస్తుందని, ఇప్పటికే రంజీ ట్రోఫీ జరుగుతుందని, ఫామ్ కోల్పోయిన వారికి మంచి ఛాన్స్ అని చెప్పాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News