Monday, December 23, 2024

అతడు ఒంటి కాలితో ఆడినా… జట్టులోకి తీసుకోండి…

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: గాయంతో కోలుకున్న రిషబ్ పంత్‌ను భారత జట్టులోకి తీసుకోవాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ తెలిపాడు. పంత్ ఒంటి కాలితో ఆడేంత ఫిట్ గా ఉన్న అతడిని జట్టులోకి తీసుకొని ఆడించాలని సూచించారు. మూడు ఫార్మాట్లలో మ్యాచ్ తిప్పగల సత్తా పంత్‌కు ఉందని ప్రశంసించారు. కెఎల్ రాహుల్‌ను వికెట్ కీపర్‌గానే పరిగణనలోకి తీసుకుంటామని, కానీ పంత్ ఒంటి కాలితో ఆడుతున్న జట్టులోకి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. తాను సెలెక్టర్‌నైతే పంత్ తొలి స్థానంలో ఉంచుతానని వివరణ ఇచ్చాడు. పంత్ అందుబాటులో లేకపోతే రాహుల్ ను వికెట్ కీపర్ గా సెలక్ట్ చేసుకోవాలని సూచించాడు. రాహుల్‌ను ఓపెనర్‌గా కాకుండా 5, 6 స్థానాల్లో ఆడించాలన్నారు. 2022 డిసెంబర్ నెలలో పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ఈ సంవత్సరం పంత్ ఐపిఎల్‌లో పునరాగమనం చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News