- Advertisement -
భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్‌పై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. అశ్విన్ మరికొంత కాలం క్రికెట్‌లో కొనసాగి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. కనీసం ఆస్ట్రేలియాతో సిరీస్ ముగిసిన తర్వాతనైనా అతను ఆటకు వీడ్కోలు పలికితే బాగుండేదన్నాడు. సిరీస్ మధ్యలో రిటైర్మెంట్ ప్రకటించడాన్ని తప్పుపట్టాడు. ఇలాంటి నిర్ణయాలు జట్టు ప్రణాళికలను దెబ్బతీస్తాయన్నాడు. అశ్విన్ అసాధారణ బౌలర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉన్నట్టుండి అతను ఎందుకి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడో తనకు అంతుబట్టడం లేదన్నాడు. చివరి రెండు టెస్టులో ఆడి ఉంటే టీమిండియాకు ప్రయోజనంగా ఉండేదన్నాడు.
- Advertisement -