Thursday, January 23, 2025

క్రికెట్‌లోకి మోడల్స్‌ను తీసుకోండి: సునీల్ గవాస్కర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌కు సర్ఫరాజ్ ఖాన్ ఎంపిక చేయకపోవడంతో చేతన్ శర్మ సెలక్షన్ కమిటీపై టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ మండిపడ్డారు. తాజాగా జరిగిన రంజీ మ్యాచ్‌లో సెంచరీల మీద సెంచరీలు చేసిన సర్పరాజ్ ను టీమిండియాకు ఎంపిక చేయకపోవడంపై మండిపడ్డారు. దేశవాళీ క్రికెట్‌లో ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లలో సర్ఫరాజ్ సూపర్ ఫామ్‌లో ఉండడంతో పాటు టన్నుల కొద్ది పరుగులు చేశాడన్నారు. అతడికి ఒక్కసారి అవకాశం ఇచ్చి ఉంటే బాగుంటుందని సెలక్షన్ కమిటీకి సన్నీ సూచించాడు. శరీర ఆకృతిని బట్టి సెలక్షన్ చేస్తారా? అని ప్రశ్నించాడు. ఫ్యాషన్ షోలలో మోడల్స్‌ను ఎంపిక చేసుకొని వారికి బౌలింగ్, బ్యాటింగ్ విభాగంలో తర్పీదును ఇచ్చి ఎంపిక చేసుకోవాలని చురకలంటించారు.

శరీర ఆకృతిని పరిగణనలోకి తీసుకోకుండా వికెట్లు, పరుగుల ఆధారంగా ఎంపిక చేసుకోవాలని బిసిసిఐకి సూచించారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో తనకు స్థానం కల్పించకపోవడంతో సర్ఫరాజ్ చాలా బాధకు లోనయ్యాడు. అతడు బాధపడుతూ గౌహతి నుంచి ఢిల్లీకి ప్రయాణించాడు. చాలా ఒంటరిగా ఉన్నానని తనలో బాధను వ్యక్తం చేశాడు. తాజాగా జరిగిన రంజీ ట్రోఫీలో నాలుగు సెంచరీలు చేయడంతో పాటు రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. మొత్తం 982 పరుగులు చేసి ముంబయి జట్టును ఫైనల్‌కు చేర్చాడు. 2019-20 రంజీ మ్యాచ్‌లలో 154.66 సగటుతో 928 పరుగులు చేసి ఐదో స్థానంలో ఉన్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సర్ఫరాజ్ 36 మ్యాచ్‌లలో 80.47 సగటుతో సెకండ్ స్థానంలో ఉండగా, తొలి స్థానంలో సర్ డాన్ బ్రాడ్‌మాన్‌కు 95.14 సగటు ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News