హైదరాబాద్: టెస్టు క్రికెట్‌లో గత కొన్ని సంవత్సరాల నుంచి ఇంగ్లాండ్ జట్టు బజ్‌బాల్ పేరుతో దూకుడుగా ఆడుతోందని టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్ సునీల్ గావస్కర్ తెలిపారు. ఇంగ్లాండ్ దగ్గర బజ్‌బాల్ ఉంటే… భారత్ వద్ద విరాట్ బాల్ ఉందని హెచ్చరించారు. జనవరి 25న ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో సునీల్ గావస్కర్ మీడియాతో ప్రసంగించారు. ఓపెనర్లు మంచి భాగస్వామ్యం నెలకొల్పితే విరాట్ కోహ్లీ భారీ స్కోర్లుగా మలుస్తాడని ప్రశంసించారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ మంచి ఫామ్‌లో ఉండడం భారత్‌కు కలిసి వచ్చే అవకాశం ఉందన్నారు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర పటేల్, యజేంద్ర చాహల్ లాంటి స్పీన్ల బౌలర్లను ఎదుర్కునే సత్తా బజ్‌బాల్‌కు ఉందా? అని సునీల్ గావస్కర్ అడిగారు. స్పీన్ బౌలింగ బజ్‌బాల్ వ్యూహం పని చేస్తుందా? అని గావస్కర్ ప్రశ్నించారు. విరాట్‌కు ఇంగ్లాండ్ ట్రాక్ రికార్డు ఉంది. ఇంగ్లాండ్ జట్లుపై 28 టెస్టులు ఆడిన విరాట్ 1991 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ తో భారత్ ఐదు టెస్టులు మ్యాచ్ లు ఆడనుంది.
మీకు బజ్‌బాల్ ఉంటే… మాకు విరాట్‌బాల్ ఉంది: సన్నీ
- Advertisement -
- Advertisement -
- Advertisement -