Tuesday, December 17, 2024

కోహ్లిపై గవాస్కర్ ఫైర్

- Advertisement -
- Advertisement -

టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లిపై భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ విమర్శల వర్షం కురిపించాడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి ఔటైన తీరుపై గవాస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో సమన్వయంతో బ్యాటింగ్ చేయాల్సిన కోహ్లి నిర్లక్షంగా ఆడి వికెట్ పారేసు కోవడాన్ని తప్పుపట్టాడు. ఈ సిరీస్‌లో కోహ్లి బ్యాటింగ్ చేస్తున్న తీరు ఏమాత్రం బాగలేదన్నాడు. అపార అనుభవం ఉన్న విరాట్ ఇలా చెత్తగా బ్యాటింగ్ చేయడం తనను ఎంతో బాధకు గురి చేస్తుందన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News