Sunday, January 19, 2025

ముంబయి జట్టు భవిష్యత్ కోసమే కెప్టెన్సీ మార్పు: సన్నీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముంబయి ఇండియన్స్ జట్టు రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలగించిన గంటలోనే ఎంఐ జట్టు ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి 4 లక్షల మంది అభిమానులు వీడారు. ముంబయి జట్టు కోచ్ మార్క్ బౌచర్ మాత్రం వివరణ ఇచ్చాడు. దీనిపై రోహిత్ సతీమణి రితికా సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ ముంబయి జట్టుకు మద్దతు పలికాడు. ముంబయి ఇండియన్స్ యజమాన్యం భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని కెప్టెన్సీని మార్చారని తెలిపాడు.

రోహిత్‌కు 36 ఏళ్లు ఉండడంతో యంగ్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా జట్టులోకి తీసుకరావడంతో పాటు కెప్టెన్ ను చేశారని అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే రోహిత్ శర్మ టీమిండియాకు మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా ఉండడంతో అతడి ఒత్తడి ఉంటుందని, ఒత్తడి తగ్గించడానికే కెప్టెన్సీ నుంచి తొలగించారని పేర్కొన్నాడు. దీంతో రోహిత్ శర్మ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడంతో ఎంఐ జట్టుకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. టాప్ ఆర్డర్ పరుగులు రాబడితే జట్టుకు కలిసి వస్తుందని తెలియజేశారు. పాండ్యా మూడు నుంచి ఐదో స్థానం వరకు బ్యాటింగ్ చేసే నైపుణ్యం అతడి వద్ద ఉందని, దీంతో జట్టు 200 పైగా పరుగులు చేసే అవకాశం ఉందని గావస్కర్ వివరించారు. హార్ధిక్ పాండ్యా సారథ్యంలోనే గుజరాత్ టైటాన్స్ ఐపిఎల్ 2023 కప్ సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News