Monday, December 23, 2024

ఇదివరకటి సునీల్‌ని చూస్తారు

- Advertisement -
- Advertisement -

Sunil Interview about 'F3' Movie

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి, ప్రముఖ నిర్మాత దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3’. డబుల్ బ్లాక్‌బస్టర్ ‘ఎఫ్ 2’ ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘ఎఫ్3’ ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్‌టైనర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమవుతోంది. ‘ఎఫ్ 3’లో స్టార్ యాక్టర్ సునీల్ హిలేరియస్‌గా ప్రేక్షకులని అలరించబోతున్నారు. సునీల్ మీడియాతో మాట్లాడుతూ “సినిమా అంతా నా పాత్ర ఉంటుంది. అయితే ఫస్ట్ హాఫ్‌లో ఎక్కువగా పర్ఫార్మెన్స్‌కి అవకాశం వుంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి గ్రూప్ కామెడీ వుంటుంది.

నేను, వరుణ్ తేజ్ ఒక బ్యాచ్, వెంకటేష్, రఘుబాబు ఒక బ్యాచ్, తమన్నా ఫ్యామిలీ ఒక బ్యాచ్, పృథ్వీ, స్టంట్ శివ ఒక బ్యాచ్, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ ఒక బ్యాచ్, వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్ ఒక బ్యాచ్.. మళ్ళీ అందరం కలసి ఒక బ్యాచ్.. అందరం కలసిన తర్వాత కామెడీ మాములుగా వుండదు. నాన్ స్టాప్ నవ్వులే. ‘ఎఫ్ 2’కి మించిన ఫన్ ‘ఎఫ్ 3’లో ఉంటుంది. వరుణ్‌తేజ్‌లో చాలా ఫన్ వుంది. ఈ సినిమాతో అది బయటికి వచ్చింది. దీని తర్వాత ఆయన నుండి ఫన్ ఓరియెంటడ్ సినిమాలు కూడా వస్తాయి. ఈ సినిమాలో ప్రేక్షకులు ఇదివరకటి సునీల్‌ని చూస్తారు. బాలీవుడ్ నుంచి కొన్ని కామెడీ రోల్స్ ఆఫర్స్ వచ్చాయి. రెండు ఓకే చేశా. ఇక దర్శకుడు త్రివిక్రమ్ కొత్త సినిమాలో నేను ఉంటాను. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, రామ్ చరణ్, శంకర్ కాంబేనేషన్ సినిమా చేస్తున్నా. మరో 13 చిన్న, మీడియం సినిమాలు కూడా ఉన్నాయి”అని అన్నారు.

Sunil Interview about ‘F3’ Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News