Monday, December 23, 2024

కమలం గూటికి సునీల్ జాఖఢ్

- Advertisement -
- Advertisement -

Sunil Jakhar Joins BJP

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి ఇటీవలే రాజీనామా చేసిన పంజాబ్ పిసిసి మాజీ అధ్యక్షుడు సునీల్ జాఖఢ్ గురువారం బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా జాఖఢ్‌ను పార్టీలోకి నడ్డా ఆహ్వానిస్తూ పంజాబ్‌లో జాఖడ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందని, పంజాబ్‌లో జాతీయవాదులను పటిష్టం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. పంజాబ్‌లో నంబర్ ఒన్ జాతీయవాద శక్తిగా బిజెపి ఆవిర్భవిస్తోందని, అందువల్ల బిజెపిని పటిష్టపరిచి, శక్తివంతమైన పంజాబ్‌ను రూపొందించడానికి జాతీయవాద సిద్ధాంతాలున్న నాయకులందరూ తమ పార్టీలో చేరాల్సిన అవసరం ఉందని నడ్డా చెప్పారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా, గురుదాస్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపిగా గతంలో గెలుపొందిన జాఖఢ్ కాంగ్రెస్ పార్టీతో తమ కుటుంబానికి ఉన్న ఐదు దశాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు. 1972 నుంచి ఇప్పటి వరకు మూడు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌తో ఉన్న అనుబంధాన్ని తెంచుకోవడం అంత సులభం కాదని ఆయన అన్నారు. కష్టకాలంలో, మంచికాలంలో కాంగ్రెస్‌తోనే ఉన్నామని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News