Wednesday, January 22, 2025

పోలీసు చెంప ఛెళ్లుమనిపించిన ఎమ్మెల్యే..(వీడియో)

- Advertisement -
- Advertisement -

ఓ ఎమ్మెల్యే.. పోలీసు చెంప ఛెళ్లుమనిపించారు. తనపై ఎమ్మెల్యే అకారణంగా చేయి చేసుకోవడంతో ఆ పోలీసు బిత్తరపోయాడు. ఈ సంఘటన పుణేలో జరిగింది. ఒక ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమానికి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో ఎమ్మెల్యే సునీల్ కాంబ్లే కూడా ఉన్నారు. కార్యక్రమం అనంతరం సునీల్ కాంబ్లే వేదిక దిగి వెళ్తూ, మెట్లపైనే నిలబడి ఉన్న ఒక పోలీసును చెంపపై కొట్టారు.

వివాదాల్లో ఇరుక్కోవడం ఎమ్మెల్యే సునీల్ కాంబ్లేకు కొత్త కాదు. గతంలో ఒకసారి పుణె మున్సిపల్ కార్పేరేషన్ మహిళా ఉద్యోగిని వేధించిన వివాదంలో ఆయన చిక్కకున్నారు. తాజా సంఘటనలో సునీల్ కాంబ్లేపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తాను కావాలని కొట్టలేదనీ, ఆ పోలీసు తనను నెట్టివేశాడని, అందుకే కొట్టానని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News