Thursday, January 23, 2025

ఆ నలుగురికి టికెట్ డౌటే..!

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు టీం నిర్వ హించిన ఫ్లాష్ సర్వే నివేదిక సోమవారం ఏఐసిసికి అందచేసినట్టుగా తెలిసింది. సోమవారం సాయంత్రం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ జరిగిన నేపథ్యంలో ఈ సర్వే నివేదిక ఆధారంగా రాష్ట్రంలోని 13 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో పలువురు ఆశావహులు ఇప్పటికే ఢిల్లీ చేరుకోగా టికెట్ల కోసం అధిష్టానం వద్ద లాబీయింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 11 స్థానాలకు అభ్యర్థులను మొదటి జాబితాలోనే

ప్రకటించాలని భావించిన కాంగ్రెస్ అధినాయకత్వం చివరి క్షణంలో వాటిని నాలుగింటికే పరిమితం చేసింది. మిగతా ఏడు నియోజకవర్గాలను పెండింగ్‌లో పెట్టింది. ఇందులో బిఆర్‌ఎస్ నుంచి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన నాలుగు స్థానాలు ఉండటం, వారికి టికెట్ కేటాయించొద్దని సీనియర్ల పట్టుబట్టడంతో ఏఐసిసి రంగంలోకి దిగింది. మరో మారు ఫ్లాష్ సర్వే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సునీల్ కనుగోలు టీం మొత్తం 13 నియోజకవర్గాల్లో ఈ ఫ్లాష్ సర్వే నిర్వహించి నివేదికను అందచేసింది.

ఏయే స్థానాలు పెండింగ్..
ఈ సర్వేలో బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారికి టికెట్లు ఇవ్వడం వల్ల నష్టం జరుగుతుందని సునీల్ కనుగోలు టీం నివేదిక ఇచ్చినట్టుగా తెలుస్తోంది. బొంతు రామ్మోహన్(సికింద్రాబాద్), పట్నం సునీతా మహేందర్ రెడ్డి(చేవెళ్ల), చంద్రశేఖర్ రెడ్డి( మల్కాజ్ గిరి), నీలం మధు(మెదక్)కు టికెట్లు రాకపోవచ్చని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఎవరెవరిని అభ్యర్థులుగా ఫైనల్ చేస్తుంది, అందులో ఏయే స్థానాలను పెండింగ్‌లో పెడుతుందో త్వరలోనే తేలనుందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News